జంపింగ్ జపాంగ్ లు .. తూర్పులో మరీను     2018-09-03   10:58:54  IST  Sai Mallula

ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ పార్టీల్లో జుంపింగ్ జపాంగ్ ల హడావుడి ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి మారుతూ నాయకులూ హడావుడి రాజకీయాలు చేస్తుంటారు. అయితే ఇవన్నీ ఎన్నికల ముందు సర్వసాధారణంగా కనిపించే. ఇక్కడ పార్టీలు మారే వారికి కావాల్సింది అనుకూల రాజకీయం, సీటు- అధికారం అనే విషయాల మీద ఆధారపడి ఈ జంపింగ్ లు జరుగుతుంటాయి. ఇక అన్ని రాజకీయ పార్టీలు కీలకంగా భావించే తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం వలసల సందడి ఎక్కువగా కనిపిస్తోంది.

Party Jamping Japang In East Religion AP-

Party Jamping Japang In East Religion In AP

ఏపీ లో త్రిముఖ పోరు తీవ్రంగా ఉండబోతున్న నేపథ్యంలో జుంపింగ్ నేతల హడావుడి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా.. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ , జనసేన పార్టీల నేతలు ఎవరికి వారు బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో తెలుగుదేశం జతకడుతుందని, బీజేపీ-వైకాపా కలసిపోతాయన్న ప్రచారమూ జరుగుతోంది. ఇదిలా వుంటే ముందస్తు ప్రచారం నేపథ్యంలో జిల్లాకు చెందిన పలువురు కీలకనేతలు రాజకీయ పార్టీల ఫిరాయింపులకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

కాకినాడ టీడీపీ ఎంపీ తోట నరసింహం, రామచంద్రపురం తోట త్రిమూర్తులు ఫిరాయించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఎంపీ నరసింహం వైసీపీ వైపు చూస్తుండగా, ఎమ్మెల్యే త్రిమూర్తులు ఇటు వైసీపీ జనసేన పార్టీ రెండిట్లో ఏదో పార్టీలో జంప్‌ చేసే యోచనలో ఉన్నట్టు తెలిసింది.

Party Jamping Japang In East Religion AP-

వైసీపీ నుంచి పోటీ చేసి టీడీపీ లోకి ప్రొఫిరాయించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావులు మళ్ళీ టీడీపీ నుంచే పోటీచేయాలని భావిస్తున్నారు. అయితే వీరిలో వరుపుల సుబ్బారావుకు ప్రత్తిపాడు టిక్కెట్‌ ఈసారి దక్కే అవకాశం లేదని వార్తలు వస్తుండడంతో పార్టీ మారేందుకు సిద్దము అవుతున్నారు. పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బొడ్డు భాస్కర రామారావుకు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు మధ్య ప్రస్తుతం హోరాహోరీ వార్‌ జరుగుతోంది.

స్థానికుడైన బొడ్డు 2019 ఎన్నికల్లో పెద్దాపురం టిక్కెట్‌ ఆశిస్తున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీలోకి బొడ్డు జంప్‌ చేయడంతో ఆయన స్థానే స్థానికేతరుడైన చినరాజప్పకు చంద్రబాబు టిక్కెట్‌ కేటాయించారు. ఒకవేళ బొడ్డుకు టిక్కెట్‌ ఇవ్వకపోతే వైసీపీ లోకి వెళ్లేందుకు కూడా ఆయన సిద్ధం అవుతున్నారు. జిల్లాకు చెందిన మరో కీలకనేత ముద్రగడ పద్మనాభం నిన్న మొన్నటివరకూ వైసీపీకి అనుకూలంగా వ్యవహరించి ఇపుడు జనసేన దిశగా సాగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.