ధరణి ప్రేమ గెలిచినట్టే ..పేపర్ బాయ్.. ఆడియన్స్ హృదయాలను గెలిచాడా... స్టోరీ.. రివ్యూ and రేటింగ్.     2018-08-31   13:09:48  IST  Sai Mallula

Movie Title; పేపర్ బాయ్

Cast & Crew:
న‌టీన‌టులు: సంతోష్ శోబన్, రియా సుమన్ త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం: జయశంకర్
నిర్మాత‌:సంపత్ నంది
సంగీతం: భీమ్స్

STORY: ఈ కథ ముంబై లో స్టార్ట్ అవుతుంది. మేఘ ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. అదే టైం లో తన ఆరోగ్యం గురించి ఓ చేదు వార్త వినాల్సి వస్తుంది. తర్వాత కథ మళ్ళీ హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతుంది. రవి ఓ పేపర్ బాయ్…అతను ధరణి అనే ధనువంతురాలిని ప్రేమిస్తాడు. ధరణి కూడా రవిని ఇష్టపడుతుంది. ధరణి ఫ్రెండ్ బర్త్ డే లో జరిగిన చిన్న గొడవ వల్ల రవి, ధరణి విడిపోతారు. చివరికి వారిద్దరూ ఎలా కలిశారు అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

Paperboy Movie Review And Rating-

Paperboy Movie Review And Rating

REVIEW:
చిన్న సినిమా అయినప్పటికీ సోషల్ మీడియాలో పేపర్ బాయ్ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ట్రైలర్ చాలా మందికి నచ్చింది. సినిమాలో విసుఅల్స్, డైలాగ్స్ చాలా బాగున్నాయి. ప్రతి ఫ్రేమ్ అందంగా కనిపించింది. ప్రతి ఒక్కరు తమ పాత్రలకు న్యాయం చేసారు. ముఖ్యంగా హీరోయిన్ తండ్రి పాత్ర ఈ సినిమాకి హైలైట్. పాటల చిత్రీకరణ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ సూపర్. కాకపోతే సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో గా నడుస్తుంది. మధ్యలో బిత్తిరి సత్తి కామెడీ ఫుల్ గా పండింది. క్లైమాక్స్ మాత్రం రియల్ లైఫ్ కి భిన్నంగా సినిమాటిక్ గా ఉంది.

Plus points:
కామెడీ
స్టోరీ
విసుఅల్స్
సినిమాటోగ్రఫీ
సాంగ్స్
డైరెక్షన్

Minus points:
సెకండ్ హాఫ్
క్లైమాక్స్

Final Verdict:
పేపర్ బాయ్ ధరణి ప్రేమను గెలిచినట్టే…ఆడియన్స్ హృదయాలను కూడా గెలిచాడు. చిన్న సినిమా అయినప్పటికీ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది.

Rating: 2.5 / 5