తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్న – 'ఆపరేష్ X'   తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్న – ‘ఆపరేష్ X’     2018-09-26   15:31:52  IST  Bhanu C

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వేడి రాజుకుంటోంది ఒక్కో రోజు ఒక్కో పరిణామాతో రాజకీయాలని తారుమారు చేసే పరిస్థితి ఏర్పడుతోంది. కేసీఆర్ తెగించి మరీ అసెంబ్లీ ని రద్దు చేసి ఎన్నికల యుద్దానికి కాలుదువ్వుతుంటే మరో వైపు ఒక్క కేసీఆర్ ని ఎదుర్కోవడానికి కూటమి కట్టిన పార్టీలు కేసీఆర్ ఓటమికి తీవ్రప్రయత్నాలు చేస్తున్నాయి టీడీపీ ,తెలంగాణా జనసమితి, సీపీఐ ,కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీలు కేసీఆర్ ని గద్దె దించాలని భావిస్తున్న తరుణంలో ఒకేఒక్క పార్టీ మాత్రం చాలా సైలెంట్ గా అభ్యర్ధులని ప్రకటించకుండా అన్ని పరిస్థితులని గమనిస్తోంది.

అయితే కేసేఆర్ ఇప్పటికే తన పార్టీ అభ్యర్ధులని ప్రకటించేశాడు మహాకూటమి పార్టీలు కూడా త్వరలో తమ అభ్యర్ధులని ప్రకటించడానికి సిద్దంగా ఉన్నాయి అయితే బీజేపీ మాత్రం ఇప్పటికీ సైలెంట్ గానే ఉంది దాంతో బీజేపీ సైలెంట్ వెనుక మర్మం ఏమిటో కనిపెట్టడానికి సిద్దమయ్యారు అభ్యర్థులను ప్రకటించడంలో ఏమాత్రం తొందరపడడం లేదట తెలంగాణ బీజేపీ నేతలు. ఈ క్రమంలోనే బీజేపీ ఒక భారీ వ్యూహాన్ని తెరపైకి తీసుకువచ్చిందట దానిపేరే ఆపరేషన్ X.

విశ్వసనీయ సమాచారం మేరకు ఆపరేష్ X అంటే..మాజీలు అని తేలింది అంటే మాజీ న్యాయమూర్తులు…మాజీ ఐపీఎస్ లు…మాజీ ఐఏఎస్ లు…మాజీ ప్రొఫెసర్లట అయితే సిద్ధాంతాల పరంగా సీరియస్ గా వ్యవహరించే బీజేపీ.. చేరికల విషయంలోనూ అదే పంధాని అమలు చేయాలని నిర్ణయించిందట.. అందుకే సమాజంలో ఏదో ఒక రంగంలో అత్యంత అనుభవం ఉన్న వారిని చేర్చుకొని వారినే అభ్యర్థులుగా ప్రకటించాలని బీజేపీ డిసైడ్ అయినట్టు సమాచారం. అందులో భాగంగానే మాజీ డీజీపీ దినేష్ రెడ్డిని బీజేపీలో చేర్చుకున్నారట.. మాజీ న్యాయమూర్తి రవీందర్ రెడ్డి కూడా త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారట..

Operation X Is Main Policy Of BJP In Telugu States-

అంతేకాదు ఏపీలో కూడా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కూడా బీజేపీలో చేరారు. ఇప్పుడు తెలంగాణలో పెద్ద ఎత్తున మాజీ అధికారులు..న్యాయమూర్తులు…ప్రొఫెసర్లను చేర్చుకొని అభ్యర్థులుగా ప్రకటించాలని కమలనాథులు పదునుపెడుతున్నారట…అంతేకాదు వివిధ పార్టీలలోని అసంత్రుప్తులని అసమ్మతి నేతలని బీజేపీ లోకి తీసుకోవడం కూడా ఆపరేషన్ X లో భాగమని చెప్తున్నారు బీజేపీ నేతలు..వీరందరినీ పార్టీలో చేర్చుకోవడం వలన పార్టీని మరింత బలంగా చేసి తెలుగు రాష్ట్రాలలో గతంలో కంటే అత్యధికమైన సీట్లు గెలుచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారట…మరి ఈ వ్యూహం ఫలిస్తుందో లేదో వేచి చూడాలి.