మీ ముఖ సౌందర్యం రెట్టింపు అవ్వాలంటే.... ఉల్లిపాయ పాక్స్     2018-08-12   11:41:59  IST  Laxmi P

ప్రతి ఒక్కరు ముఖం అందంగా,కాంతివంతంగా ఎటువంటి మచ్చలు లేకుండా ఉండాలని కోరుకుంటారు. అయితే దీని కోసం ఎటువంటి కాస్మొటిక్స్ వాడవలసిన అవసరం లేదు. మన వంటింటిలో ఉండే ఉల్లిపాయను ఉపయోగించి ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. మీకు చాలా ఆశ్చర్యంగా ఉందా? నిజమే. ఉల్లిపాయతో ఎన్నో చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఎలా అనేది వివరంగా తెలుసుకుందాం.

ఒక స్పూన్ ఉల్లిరసంలో అరస్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి మొటిమలు ఉన్న ప్రదేశంలో కాటన్ సాయంతో రాయాలి. పావుగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ప్రతి రోజు ఇలా చేస్తూ ఉంటే మొటిమలు త్వరగా తగ్గిపోతాయి.

Onion Beauty Benefits-

Onion Beauty Benefits

ఉల్లిపాయ ముడతలను చాలా సమర్ధవంతంగా తగ్గిస్తుంది. ఉల్లిపాయను ముక్కలుగా కోసుకొని మిక్సీలో పేస్ట్ కింద తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే ముడతలు తగ్గిపోతాయి.

ఉల్లిపాయ రసంలో పెరుగు, కొన్ని చుక్కల లావెండర్ నూనెను వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే నల్లని మచ్చలు తొలగిపోతాయి.

ఉల్లిరసం, శనగపిండి, పచ్చిపాలను బాగా కలిపి ప్యాక్‌లా తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత కడిగితే మంచి ఫలితం ఉంటుంది.