ఆమె ఒకప్పుడు వీధుల్లో పచ్చల్లమ్ముకుంది..ఇప్పుడు కోట్ల టర్నోవర్ చేసే కంపెనీకి ఓనర్ అయింది.. మోడీ ప్రశంసలు పొందింది..   Once Upon A Time She Is A Pickle Woman Now She Has A Own Company     2018-09-18   14:30:09  IST  Rajakumari K

కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు.. లక్ష్యంపై దృష్టిపెడితే ఎన్ని కష్టాలొచ్చినా వాటిని అధిగమించి లక్ష్యాన్ని చేరుకోవచ్చు..అందుకు ప్రత్యక్ష ఉదాహరణ కృష్ణాయాదవ్..ఒకప్పుడు వీధుల్లో తిరుగుతూ పచ్చల్లు అమ్ముకొన్న ఈమె ఇప్పుడు కొన్ని కోట్లు టర్నోవర్ చేస్తున్న పచ్చళ్ల కంపెనీకి ఓనర్ అయింది. ఈమె ఎన్నో రకాల వెరైటీ పచ్చడిలను ఆహార పదార్ధాలను అమ్ముతూ శబాష్ అని అనిపించుకొంటుంది…పచ్చళ్లమ్ముకోవడం కూడా గొప్పేనా అని తీసిపారేయకండి.. పచ్చల్లమ్ముకునే ఎన్నో అవార్డులు మరియు రివార్డులు సొంతం చేసుకుంది.

కృష్ణ యాదవ్ సొంతూరు ఉత్తర్ ప్రదేశ్..కానీ ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు. భర్త మరియు ఇద్దరు పిల్లలు కృష్ణ యాదవ్ కుటుంబం. అయితే ఈమె పెద్దగా చదువుకోలేదు. ఈమె భర్త చదువు కూడా అంతంత మాత్రమే.దాంతో ఇద్దరు కలిసి ఊరగాయ వ్యాపారం మొదలు పెట్టారు . పలు రకాల ఊరగాయలు తయారు చేసి అమ్మేవారు. కానీ ఉత్తర్ ప్రదేశ్లో వెరీ వ్యాపారం సరిగా జరగలేదు.దీంతో వారు ఢిల్లీకి మకాం మార్చారు.అక్కడికి వెళ్లాక 1996 లో కృష్ణ యాదవ్ ఫుడ్ ప్రాసెసింగ్ శిక్షణ తీసుకొంది .శిక్షణలో తెలుసుకున్న మెలకువలతో ఊరగాయలు వ్యాపారం మొదలు పెట్టింది.మొదట ఐదువందల రూపాయలు ఆ తరవాత పచ్చడి తయారీ కోసం కావాల్సిన సరుకులు కొన్నది. ఆ తర్వాత రూ.3000 ఖర్చు పెట్టి కరివి అంటే హిందీలో కరొండా అనే కాయతో 100 కేజీల ఊరగాయ పెట్టింది. దింతో పాటు 5 కేజీల మిరపకాయ పచ్చడి కూడా పెట్టింది మొత్తానికి వీటిని అమ్మేయగా ఆమెకు రూ.5200 లాభం వచ్చింది.దాంతో ఎలా అయిన పచ్చళ్ల వ్యాపారంలోనే కొనసాగాలని నిర్ణయించుకుంది.

Once Upon A Time She Is Pickle Woman Now Has Own Company-

నిర్ణయంలో భాగంగా తన భర్తతో కలిసి రకరకాల ఆహార పదార్థాలు చేసి ఒక స్వగృహ ఫుడ్స్ లాగా ప్రారంభించింది. ఈ క్రమంలో వారి వ్యాపారం బాగా సాగింది. దింతో వీరు ఏకంగా శ్రీ కృష్ణ పికెల్ అని ఒక కంపెనీ ప్రారంభించారు.దీంతో వీరు ఈటా కోట్ల రూపాయిలు సంపాదిస్తున్నారు. ఇప్పటకీ ఈమె ఏదో ఒక వెరైటీ ఉరగాయి తయారు చేస్తుంటుంది..వాటికి వచ్చే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈమె మరియు ఆమె భర్త ఢిల్లీలో ప్రముఖ వ్యాపారులలాగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే కృష్ణ యాదవ్ కు పలు అవార్డులు మరియు రివార్డులు లభించాయి. ఈమెకు 2015 లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా నారి శక్తి పురస్కార్ అవార్డును కృష్ణ యాదవ్ అందుకొంది.అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఉత్తమ మహిళా వ్యాపారిగా రూ.51000 వేలు అందుకొంది.వ్యాపారంలో రాణించాలన్నా,డబ్బు సంపాదించాలన్నా పెద్దగా చదువు కోలేకపోయామనే బాధపడుతు కూర్చుంటూ ఈ రోజు కృష్ణాయాదవ్ ఇంత గుర్తింపు పొందేదే కాదు..కాబట్టి మన మెదడుకి పని పెట్టి,కష్టాన్ని నమ్ముకుంటే సాధించనిదంటూ ఏదీ లేదు..