మొన్న బ్లూవేల్..నిన్న మోమో...నేడు ఒలివీయా...వాట్సప్లో చక్కర్లు కొడుతున్న కొత్త ఛాలెంజ్.. తస్మాత్ జాగ్రత్త.!   Odisha Police Warns About Olivia Hoax On WhatsApp     2018-09-27   09:22:03  IST  Rajakumari K

‘ఒలీవియా’… ఇప్పుడు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న పేరు. ‘ఒలీవియా’ పేరుతో వాట్సప్‌లో ఓ మెసేజ్ వస్తుంది..ఎవరూ అని మనం అడిగితే.. తనను గుర్తు పట్టలేదా అంటూ అవతలి వ్యక్తి మాటలు కలుపుతుంటారు.అంతటితో ఆగకుండా పరిచయం పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. మనం కలిసి దిగిన ఫోటో పంపిస్తానంటూ ఓ లింక్ షేర్ చేస్తారు. ఆ లింక్ క్లిక్ చేస్తే అంతే…. ఇలా యువతను ఉచ్చులోకి లాగుతున్నారు..ఇంతకీ ఆ లింక్లో ఏముంటుంది తెలుసా..

ఆ ఛాటింగ్‌లో వచ్చే లింక్ క్లిక్ చేస్తే పోర్న్ వెబ్‌సైట్‌ ఓపెన్ అవుతుంది. అందులో నగ్న చిత్రాలు, లైంగిక చర్యలకు సంబంధించిన వీడియోలు కనిపిస్తున్నాయి. ఈ మోసానికి ‘ఒలీవియా ముప్పు’ అని పేరు పెట్టారు. టీనేజర్లు పోర్న్‌ వీడియోలు చూసేలా ప్రేరేపిస్తున్నట్టు తేలింది. ఇప్పటికే ‘ఒలీవియా ముప్పు’ బారినపడ్డవాళ్లు అనేకమంది ఉన్నారని అంచనా..’ఒలీవియా’ పేరుతో జరిగిన ఛాటింగ్ స్క్రీన్‌షాట్స్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. ఈ స్క్రీన్ షాట్స్ ఆధారంగా పోలీసులు తల్లిదండ్రుల్ని హెచ్చరిస్తున్నారు.ఇదే విషయంపై ఒడిషా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇటీవల ఓ ట్వీట్ చేశారు. పిల్లల ఆన్‌లైన్ యాక్టివిటీపై ఓ కన్నేసి ఉంచాలని, అపరిచితులు స్నేహం పేరుతో మాటలు కలిపితే ఆ నెంబర్లను బ్లాక్ చేయాలని పోలీసులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు…

ఇప్పటికే బ్లూవేల్ గేమ్, మోమో ఛాలెంజ్ కలకలం రేపుతుంటే… ఇప్పుడు కొత్తగా ‘ఒలీవియా ముప్పు’ పొంచి ఉండటం మరింత ఆందోళనకరం. అయితే పిల్లలపై తల్లిదండ్రుల నిఘా తప్పనిసరి అని ఈ ఘటనలు నిరూపిస్తున్నయి.. మొన్న బ్లూవేల్, నిన్న మోమో ఛాలెంజ్, ఇప్పుడు ఒలీవియా… రేపు మరో కొత్త పేరుతో మరో ముప్పు రావొచ్చేమో.తస్మాత్ జాగ్రత్తా..