దసరాకు ఎన్టీఆర్‌తో ఢీ కొట్టబోతున్న రవితేజ     2018-08-12   12:24:17  IST  Ramesh Palla

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అరవింద సమేత’. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం విడుదల తేదీపై ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు. దసరా కానుకగా అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎన్టీఆర్‌ అభిమానులతో పాటు, అందరిలో కూడా ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. దసరాకు విజేత అయ్యేది ఎన్టీఆర్‌ అంటూ అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఈ సమయంలోనే ఎన్టీఆర్‌కు పోటీగా రవితేజ రంగ ప్రవేశం చేయబోతున్నాడు.

Ntr Verses Ravi Teja Dasara Race-

Ntr Verses Ravi Teja Dasara Race

వరుసగా ఫ్లాప్‌ అవుతూ వస్తున్న రవితేజ, వరుసగా డిజాస్టర్‌లు మూటకట్టుకున్న శ్రీనువైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’. ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీస్‌ బ్యానర్‌ వారు తమ సినిమాను అక్టోబర్‌లో దసరా కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. చాలా రోజులుగా మైత్రి మూవీస్‌ వారు నిర్మిస్తున్న అమర్‌ అక్బర్‌ ఆంటోనీ మరియు సవ్యసాచి చిత్రాల విడుదల విషయంలో సస్పెన్స్‌ కొనసాగుతుంది.

Ntr Verses Ravi Teja Dasara Race-

తాజాగా మైత్రి వారు ఆ సస్పెన్స్‌కు తెర దించేశారు. ఎలాంటి అనుమానాలు లేకుండా విడుదల తేదీలపై క్లారిటీ ఇచ్చారు. రవితేజ మూవీని అక్టోబర్‌లో, సవ్యసాచి మూవీని నవంబర్‌లో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ రెండు చిత్రాలు తప్పకుండా ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటాయి అంటూ మైత్రి మూవీస్‌ వారు నమ్మకంగా చెబుతున్నారు. ఇప్పటి వరకు మైత్రి మూవీస్‌లో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను అలరించాయి.

ముఖ్యంగా ఈ ఏడాది వేసవి కానుకగా వచ్చిన రంగస్థలం చిత్రం భారీ వసూళ్లను సాధించింది. అంతకు ముందు శ్రీమంతుడు ఇంకా పలు సినిమాలు కూడా మైత్రి వారికి సక్సెస్‌ను తెచ్చి పెట్టాయి. అందుకే ఈ చిత్రాలపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఎన్టీఆర్‌ మూవీకి పోటీగా రాబోతున్న రవితేజ ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తాడో చూడాలి.