ఎన్టీఆర్‌ ఎక్కడ మొదలై ఎక్కడ ముగియనుందో తెలుసా?     2018-08-12   10:13:24  IST  Ramesh Palla

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర మూవీ ‘ఎన్టీఆర్‌’పై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది. ఈ చిత్రం ఎక్కడ మొదలై, ఎక్కడ ఎండ్‌ అవుతుందో అంటూ చాలా రోజులుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో కొన్ని వివాదాస్పద అంశాలను చూపించే అవకాశం ఉందా లేదా అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్‌ జీవితంలో లక్ష్మీ పార్వతి మరియు చంద్రబాబు నాయుడు అధికారంను లాక్కోవడం కీలకమైన ఘట్టాలు.

Ntr Biopic Movie Starting And Ending Story-

Ntr Biopic Movie Starting And Ending Story

ఆ రెండు ఘట్టాలను చూపిస్తారా లేదంటే మరేదైనా తీరులో సినిమాను ప్లాన్‌ చేయబోతున్నారా అంటూ సినీ వర్గాల నుండి ప్రేక్షకుల వరకు అంతా అనుకున్నారు. ఎన్టీఆర్‌ చిత్రాన్ని ఎక్కడ నుండి ఎక్కడ వరకు చూపించాలో దర్శకుడు క్రిష్‌ ఒక క్లారిటీతో ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ఎన్టీఆర్‌ రెండవ సారి సీఎం అయ్యేంత వరకు మాత్రమే సినిమా ఉంటుందని సమాచారం అందుతుంది.

Ntr Biopic Movie Starting And Ending Story-

ఎన్టీఆర్‌ నుండి నాదెండ్ల భాస్కర్‌ రావు అధికారంను లాక్కోవడం, ఆ తర్వాత ఎన్టీఆర్‌ మళ్లీ సీఎం అవ్వడం జరిగింది. అప్పటి వరకు సినిమాను చూపించి ముగించే అవకాశం కనిపిస్తుంది. ఎన్టీఆర్‌ బయోపిక్‌ మొత్తం బసవతారకం చుట్టు తిరిగేలా కథను అల్లడం జరిగింది. ఎన్టీఆర్‌ స్టోరీని బసవతారకం చెప్పే విధంగా ప్లాన్‌ చేశారు. బసవతారకం బతికి ఉన్నంత వరకు సినిమా సాగుతుంది. అప్పటి వరకు మాత్రమే ఎన్టీఆర్‌ జీవితంలో జరిగిన కీలక సంఘటనలు చూపించబోతున్నారు.

బసవతారకం చనిపోయిన తర్వాత లక్ష్మి పార్వతిని వివాహం చేసుకోవడం, చంద్రబాబు నాయుడు వివాదాస్పద నిర్ణయం తీసుకుని ప్రభుత్వంను తన చేతుల్లోకి తీసుకోవడం చేశాడు. అందుకే ఎన్టీఆర్‌ చిత్రంలో ఈ రెండు ఘట్టాలు ఉండవు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. అత్యంత వివాదాస్పద విషయాలు అయిన ఈ రెండు విషయాలను స్కిప్‌ చేయడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా, ఎన్టీఆర్‌ జీవితాన్ని వివాదం లేకుండా చూపించడం మంచి నిర్ణయమే అని కొందరు అంటున్నారు.