అమెరికాలో ..ఎన్నారైల ఉపాస..ఆత్మీయ సమ్మేళనం..     2018-08-28   14:50:33  IST  Bhanu C

అమెరికాలో పేరొందిన తెలుగు సంఘాలలో ఒకటైన ఉపాస (UPAS) సంఘం సభ్యులు అందరూ ఒకే వేదికగా కలిసుకున్నారు..ఆటపాటలతో ఆహ్లాదంగా పచ్చని వాతావరణంలో పిల్లలతో గడిపారు..న్యూ జెర్సీ , మన్రో టవున్ షిప్ , థాంసన్ పార్క్ లో జరిగిన ఈ సంఘ సభ్యుల కుటుంబ వేడుకల్లో పాల్గొనడానికి..అమెరికా రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, కనక్టికట్, న్యూయార్క్ ల నుండి పెద్ద ఎత్తున ఉపాస సభ్యులు చేరుకున్నారు..

NRI USA Helping For Uddanam Kidney Patients-

NRI USA Helping For Uddanam Kidney Patients

ఎవరికీ వారుగా తెలుగు వంటలు వండి తీసుకువచ్చారు..ఉపాస సభ్యులు అందరూ ఆటపాటలతో అందరి కుటుంభ సభ్యులతో చేరి సంతోషంగా గడిపారు..ఉపాస సభ్యులలో కొందరు వాలీ మరి కొందరు షట్లర్ ఆడుతూ సమయం గడిపారు ఈ సందర్భంగా ఉపాస సంస్థ సభ్యులైన డాక్టర్లు శ్రీ సాయి కొల్ల , శ్రీ రామ్ కొల్ల ఉపాస సభ్యులకు బ్లడ్ షుగర్ టెస్ట్ చేసుకొనే ఎలక్ట్రానిక్ పరికరాలను ఉచితంగా పంపిణీ చేశారు .

NRI USA Helping For Uddanam Kidney Patients-

అయితే ఆటపాటల ద్వారా వచ్చిన నగదు మొత్తాన్ని ఏపీలో కిడ్నీ సమస్యలతో భాదపడుతున్న శ్రీకాకుళం ఉద్దానం ప్రాంత ప్రజలకు అందచేయఅనున్నట్టు తెలిపారు..ఉపాస అనేది కేవలం సేవ కోసం మాత్రమే స్థాపించబడిన సంఘం ఈ సంఘంలో ఎంతో మంది చేరుతూ సంఘం రెట్టిపు అవుతోంది అంటూ సంతోషం వ్యక్తం చేశారు..ఇదే సమయంలో ఉపాస సంస్థ జనసేన పార్టీ కి పూర్తి మద్దతు తెలుపుతోందని ప్రకటన చేశారు..