అబ్బాయి పుడితే...అమ్మాయని నమ్మించడానికి ఆ డాక్టర్ ఎంత నీచమైన పని చేసాడో తెలుసా.? షాకింగ్!!!  

నేటి త‌రుణంలో ఎక్క‌డ చూసినా న‌కిలీల బెడ‌ద ఎక్కువైపోయింది. చివ‌ర‌కు వైద్యం చేసే డాక్ట‌ర్లలోనూ న‌కిలీ డాక్ట‌ర్లు పుట్టుకు వ‌స్తున్నారు. దీంతో వారు జ‌నాల ప్రాణాల‌తో ఆట‌లాడుకుంటున్నారు. వైద్యం చేయ‌డం తెలియ‌క‌పోవ‌డంతో వారి వ‌ద్ద‌కు వ‌చ్చే అమాయ‌కులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ ప్రాంతంలోనూ ఓ న‌కిలీ డాక్ట‌ర్ చేసిన నిర్వాకం వ‌ల్ల ఓ పసికందు ప్రాణాల‌ను కోల్పోయాడు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

అది జార్ఖండ్‌లో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రి. అనుజ్ కుమార్ అనే వ్య‌క్తి ఆ హాస్పిట‌ల్‌ను ర‌న్ చేస్తున్నాడు. నిజానికి అత‌ను డాక్ట‌ర్ కాదు. న‌కిలీ డాక్ట‌ర్‌. డాక్ట‌ర్ అవ‌తారం ఎత్తి ఆ ప్రాంతంలో జ‌నాలకు వైద్యం చేస్తూ వారిని మోసం చేస్తున్నాడు. అయితే ఆ విష‌యం తెలియ‌ని గుడియా దేవి అనే మ‌హిళ 8 నెల‌ల గ‌ర్భంతో ఆ హాస్పిట‌ల్‌లో చేరింది. ఈ క్ర‌మంలో పుట్ట‌బోయేది ఆడ‌పిల్ల అని అనుజ్ గుడియా దేవికి చెప్పాడు. తాను స్కానింగ్ చేశాన‌ని, అందులో ఆడ‌పిల్ల అని తెలిసింద‌ని అత‌ను చెప్పాడు.

Newborn Baby Boy's Genitals Mutilated By 'fake Doctor' To Prove He Was Born Girl-

Newborn Baby Boy's Genitals Mutilated By 'fake Doctor' To Prove He Was Born Girl

అలా హాస్ప‌ట‌ల్‌లో చేరిన గుడియా దేవి కొన్ని రోజుల‌కు ప్ర‌స‌వించింది. డెలివ‌రీ చేసినందుకు గాను మొత్తం రూ.10వేలు అవుతాయ‌ని అనుజ్ చెప్పాడు. అందులో భాగంగా గుడియా దేవి కుటుంబ సభ్యులు ముందుగా రూ.5వేల‌ను చెల్లించారు. అయితే గుడియా దేవి మాత్రం మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. దీంతో తాను అంత‌కు ముందు ఆడ‌పిల్ల పుడుతుంద‌ని అనుజ్ గుడియాకు చెప్పిన విష‌యాన్ని గుర్తు చేసుకున్నాడు. విష‌యం తెలిస్తే త‌న ప‌రువు పోతుంద‌ని, దీంతో త‌న దందాకు ఇబ్బంది క‌లుగుతుంద‌ని భావించిన అనుజ్ ఆ మగ‌బిడ్డ జ‌న‌నావ‌య‌వాల‌ను క‌ట్ చేశాడు. అనంత‌రం గుడియా దేవి కుటుంబానికి ఆడ‌పిల్ల పుట్టింద‌ని, కానీ కొన్ని లోపాలున్నాయ‌ని అనుజ్ చెప్పాడు. ఇది నిజ‌మేన‌ని గుడియా దేవి కుటుంబ స‌భ్యులు న‌మ్మారు.

Newborn Baby Boy's Genitals Mutilated By 'fake Doctor' To Prove He Was Born Girl-

అయితే జ‌న‌నావ‌య‌వాల‌ను క‌ట్ చేసినందున ఆ మ‌గ‌బిడ్డ కొంత సేప‌టికి చ‌నిపోయాడు. దీంతో గుడియా దేవి కుటుంబానికి అస‌లు విష‌యం తెలిసింది. ఈ క్ర‌మంలో బాధితులు ఫిర్యాదు చేయ‌గా, పోలీసులు కేసు న‌మోదు చేసుకుని అనుజ్‌ను అరెస్టు చేశారు. అత‌నికి డాక్ట‌ర్ డిగ్రీ లేద‌ని, న‌కిలీ డాక్ట‌ర్ అని పోలీసులు ధ్రువీక‌రించారు. చూశారుగా.. ఓ న‌కిలీ డాక్ట‌ర్ చేసిన ప‌ని వ‌ల్ల ఓ నిండు ప‌సికందు ఎలా ప్రాణాల‌ను కోల్పోయాడో… ఏది ఏమైనా ఇలాంటి న‌కిలీ డాక్ట‌ర్ల‌కు మాత్రం క‌ఠినంగా శిక్ష వేయాల్సిందే..!