'సమంత' పెట్టిన ఆ పోస్టుకు నెటిజెన్స్ ఎలా ఫైర్ అవుతున్నారో చూడండి.! మరి ఇంతకముందు ఏమనలేదెందుకు?   Netjens Fire On Samantha Instagram Post     2018-09-27   08:34:23  IST  Sainath G

అక్కినేని వారి కోడలుగా మారిన‌ తరువాత సమంతపై ఉన్న అభిమానం గౌరవంగా మారిపోయింది. ఆమెని ఓ హీరోయిన్ గా కాకుండా తెలుగింటి కోడలుగా చూస్తున్నారు చాలా మంది అభిమానులు. అలానే ఈ మధ్యకాలంలో సమంత కూడా చాలా పద్దతిగా కనిపిస్తూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ పై నెటిజ‌న్స్ మండిప‌డుతున్నారు.

స‌మంత ప్ర‌స్తుతం భ‌ర్త చైత‌న్య‌తో క‌లిసి విదేశీ యాత్ర‌కు వెళ్లింది. అక్క‌డ తీయించుకున్న ఓ హాట్ ఫోటోను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. సాధార‌ణంగా పెళ్లి అయిన త‌ర్వాత గ్లామ‌ర‌స్‌గా క‌నిపించేందుకు ఏ హీరోయినూ ఇష్ట‌డ‌ప‌డ‌దు. అయితే స‌మంత మాత్రం ఇందుకు మిన‌హాయింపు. స‌మంత పోస్ట్ చేసిన ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. `మాన‌సిక ప్ర‌శాంత‌త‌` అంటూ స‌మంత‌ పోస్ట్ చేసిన ఈ ఫోటో నాలుగు గంట‌ల్లోనే దాదాపు ఐదు ల‌క్ష‌ల లైకుల‌ను సాధించింది.

ఇక కామెంట్ల రూపంలో మరి కొందరు ఈ పిక్‌లోని సమంతపై తమ ప్రేమను వ్యక్తం చేస్తుండగా, కొందరు మాత్రం సమంతకు హితవచనాలు చెబుతున్నారు. ఇలాంటి ఫొటో పోస్టు చేయడం ఏమిటని అంటున్నారు. ఇలాంటి డ్రస్‌లో ఫొటోలు దిగి వాటిని సోషల్ మీడియాకు ఎక్కించవద్దని కామెంట్లు పెడుతున్నారు.

Netjens Fire On Samantha Instagram Post-

నీకు పెళ్లయింది… నీపై గౌరవం ఉంది… దయచేసి ఇలాంటి డ్రెస్సులు వేయవద్దు అంటూ కొందరు ఫ్యాన్స్ సూచించారు. మరికొందరేమో డ్రెస్సు బాగానే ఉంది కానీ ఇది నీకు సూటవ్వలేదు అంటూ విమర్శించారు. అభిమానులుగా ఏది కరెక్టో.. ఏది తప్పో చెప్పే బాధ్యత మాపై ఉంది. ఇలాంటి డ్రెస్సులు నువ్వు వేసుకోవడం మాకు నచ్చడం లేదు. దయచేసి మరోసారి ఇలాంటి ఫోటోలు పోస్టు చేయకండి మేడమ్ అంటూ కొందరు అభిమానులు సూచిస్తున్నారు

పెళ్లి కాకముందు సమంతను ఇలాంటి బట్టల్లో చూసిన వారికి ఇప్పుడేంటి సమస్య అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ట్రోలింగ్ పై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి..!