మానవత్వం పరిమళించిన వేళ... సోషల్ మీడియా వేధికగా కుటుంబానికి అండగా నిల్చిన నెటిజన్లు...   Netizens Helps To The Poor People In New Delhi     2018-09-19   15:50:33  IST  Rajakumari K

ఉదయం లేచింది మొదలు,రాత్రి పడుకునే వరకు అరచేతిలో మొబైల్ లేనిదే గడవదు..కానీ ఎంతసేపు ఫోన్లో టైం పాస్ చేస్తున్నారనో,లేదంటే సోషల్ మీడియా అంటే ఫేక్ పనులకే కేరాఫ్ అనుకుంటే పొరపాటు అని నిరూపించింది ఈ ఘటన..తండ్రిని కోల్పోయిన కొడుకుకి సోషల్ మీడియా వేధికగా నెటిజన్లు చేసిన సాయం అందరి చేత శెభాష్ అనిపించుకుంటుంది..

ఢిల్లీలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న అనిల్ డ్రైనేజీ గుంతలో 20 మీటర్ల లోతుకు జారిపడి మరణించాడు.అనిల్ మరణంతో ఆయన కుటుంబం రోడ్డున పడింది.అసలే పేద కుటుంబం..కనీసం దహన సంస్కారాలు చేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి…అనిల్ మృతదేహంపై అతని కొడుకు నిలబడి ఏడుస్తూ ఉన్న ఫోటోని ఎవరో సోషల్ మీడియాలో పోస్టు చేశారు..ఆ ఫోటో చూసిన అందరూ కన్నీంటిపర్యంతమయ్యారు. ఆ ఫోటను చూసిన నెటిజన్లు చూసి రెండు కన్నీటి బొట్లు కార్చి వదిలేయకుండా.. ఆ కుటుంబానికి సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. కెట్టో. ఆర్గ్‌లో క్రౌడ్ ఫండింగ్ పేజ్‌ను ప్రారంభించి ఫండింగ్ చేయాలంటూ యూజర్లను కోరారు.

Netizens Helps To The Poor People In New Delhi-

ఆ పిలుపుతో స్పందించి చాలా మంది దాతలు తమకు తోచినంత ఫండింగ్ చేశారు. ఆన్‌లైన్‌‌లో అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తమే విరాళంగా వచ్చింది.మొత్తం 24లక్షల రూపాయలు ఫండ్ రావడంతో,ఆ మొత్తాన్ని ఆ కుటుంబానికి అందచేశారు. అలాగే అనిల్ తన కొడుకుకు ఓ సైకిల్ కొనిస్తానని మాట ఇచ్చినట్లు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి.దీంతో అనిల్ కొడుకుకి సైకిల్ ను కూడా పంపించింది.ఇలాంటి ఘటనలు చూసినప్పుడే మానవత్వం ఇంకా ఉందనిపిస్తుంటుంది.