గీత మధురిపై నెటిజెన్స్ ఫైర్! ఆ ముద్దులు ఏంటి.? అసలు అది సామ్రాట్ టాస్క్ కాదు.!     2018-08-24   10:42:29  IST  Sai Mallula

హమ్మయ్య.. బిగ్ బాస్ పెళ్లి వేడుక ముగిసింది. గత మూడు రోజులుగా బిగ్ బాస్ హౌస్‌లో బొమ్మలపెళ్లి డ్రామాలో కంటెస్టెంట్స్ పోటీ పడి మరీ జీవించేయగా.. నేడు బొమ్మలకు పెళ్లిచేసి, శోభనం కార్యక్రమంతో ముగింపు పలికారు. చూసే ఆడియన్స్ కి విరక్తి వచ్చేంత అతిగా చేసారు హౌస్ సభ్యులు. ఈ షో అనౌన్స్ చేసినప్పుడే ఇంకొంచెం మసాలా అని అన్నారు. దానికి తగ్గట్లే హౌస్ లో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొదట్లో తనీష్-సునైనా, ఆ తరువాత సామ్రాట్-తేజస్వి, తనీష్-నందిని ల రొమాంటిక్ ట్రాక్ లు నడిచాయి. ఇప్పుడు నందిని, సునైనా, తేజస్వి ఎలిమినేట్ కావడంతో ఆ బాధ్యతల్ని సామ్రాట్-గీతామాధురి తీసుకున్నట్లుగా ఉన్నారు.

Netizens Fire On Geetha Madhuri Bigg Boss Show-

Netizens Fire On Geetha Madhuri Bigg Boss Show

రోల్ రైడా, సామ్రాట్ బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌లను విజయవంతంగా కంప్లీట్ చేసినందుకు గానూ బిగ్ బాస్ నుండి అభినందలు వచ్చాయి. ఇంతకీ మీకు ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌లు ఏంటి? అని కంటెస్టెంట్స్ అడగటంతో.. గీతా మాధురికి ముద్దు పెట్టడం, పూజాను పెళ్లికి ఒప్పించడం, గణేష్‌ను స్విమ్మింగ్ ఫూల్‌లోకి తోయడం, రెండు స్వీట్స్ బాక్స్‌లను ఎవరికీ కనిపించకుండా తినడం లాంటి వాటిని వరుసగా చెప్పుడంతో విని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Netizens Fire On Geetha Madhuri Bigg Boss Show-

నిజానికి రోల్ రైడా.. గీతామాధురికి ముద్దు పెట్టాలనేది టాస్క్. రోల్ కి ఈజీ అవ్వడం కోసం సామ్రాట్ ముందుగా గీతకు ముద్దుపెట్టాడు. దీంతో సోషల్ మీడియాలో గీతామాధురిపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. బిగ్ బాస్ షో ఆరంభంలో ఎంతో మెచ్యూర్డ్ గా వ్యవహరించిన గీతా రాను రాను ఈ విధంగా ప్రవర్తించడం ప్రేక్షకులకు రుచించడం లేదు. టాస్క్ లో భాగమే అయినప్పటికీ.. సామ్రాట్, తనీష్, రోల్ లతో మాట్లాడుతూనే నందుతో మాట్లాడుతున్నట్లు ఉందని తన భర్తని వారితో పోల్చడం ఇప్పుడు నెటిజన్లకు ట్రోల్ చేయడానికి ఆస్కారంగా మారింది.

అంతేకాదు ‘నీవెవరో’ లవ్ ప్రపోజ్ టాస్క్‌లో భాగంగా.. కౌశల్‌ను బిగ్ బాస్‌గా ఊహించుకుని అతన్ని ప్రేమలో పడేయాలని సింగర్ గీతా మాధురికి టాస్క్ ఇచ్చారు. తన అల్లరి, చిలిపి, రొమాంటిక్ చేష్టలతో బిగ్ బాస్‌గా ఉన్న కౌశల్‌ను ప్రేమలో దించేందుకు తెగ ప్రయత్నించింది గీత. అయితే కౌశల్ బిగ్ బాస్ గొంతుతో గంభీరంగా మాట్లాడుతూ గీత ప్రేమను రిజెక్ట్ చేశారు. నువ్ బిగ్ బాస్‌కి దూరంగా ఉండు, పట్టుకోవద్దు, నిన్ను ఎలిమినేషన్ చేస్తా అంటూ హెచ్చరించినా గీతా మాధురి వెనక్కితగ్గలేదు.