బాబు స్కెచ్ అదుర్స్...చంద్రగిరి బరిలో హరికృష్ణ తనయుడు.   Nandamuri Kalyan Ram To Participate In AP Elections From Chandragiri     2018-09-20   11:18:47  IST  Bhanu C

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి కొరకరాని కొయ్యగా మారిన ఏకైక స్థానం చంద్రగిరి..చెప్పుకుంటే సిగ్గు చేటులా చంద్రగిరి వేరే ఏ జిల్లాలోనో లేదు చంద్రబాబు సొంత నియోజకవర్గం ,అది కూడా చిత్తూరు జిల్లాలోనే ఉంది ఈ చంద్రగిరి అయితే ఏంటి అక్కడి ప్రజల మాత్రం టీడీపీ యేతర పార్టీలకి పట్టం కడుతూ వచ్చారు. చివరికి చంద్రబాబు సైతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో చంద్రగిరి నుంచీ ఓడిపోయారు కూడా అయితే అప్పటి నుంచీ చంద్రబాబు కి తన సొంత నియోజకవర్గంలో గెలుపు కష్టమయ్యింది..

ఇప్పటి వరకూ టీడీపీ పార్టీ పెట్టిన తరువాత రెండే రెండు సార్లు చంద్రగిరి నుంచీ గెలిచిందంటే అక్కడ టీడీపీ పవనాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు..అయితే కాంగ్రెస్ పార్టీ వరుసగా నాలుగుసార్లు అక్కడ గెలుపు జెండా ఎగరేసింది అది కూడా గల్లా అరుణ అభ్యర్దిత్వంలో కానీ గల్లా విభజన తరువాత టీడీపీ గూటికి వెళ్లిపోవడంతో అక్కడ ఒట్లర్లు తమ సంస్కృతిని కంటిన్యూ చేశారు..గల్లాని చిత్తు చిత్తుగా ఓడించి వైసీపీ నేత చెవిరెడ్డి కి పట్టం కట్టారు..అయితే దేశంలోనే ఉన్న సీనియర్ నేతల్లో ఒకడిగా చెప్పుకునే చంద్రబాబు కి సొంత నియోజకవర్గంలో గెలుపు లేకపోవడం కొన్నేళ్లుగా చంద్రబాబు ని భాదిస్తున్న అంశమే..

అయితే ఈ సారి ఎలాగైనా చంద్రగిరిలో జెండా ఎగరేయాలని చూస్తున్న బాబుకి ఈ సారి గెలుపు పక్కా అంటున్నారు టీడీపీ నేతలు అందుకోసం భారీ వ్యూహాన్ని కూడా సిద్దం చేశారట..ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..గత ఎన్నికల్లో హరికృష్ణ ఫ్యామిలీ ని దూరంగా ఉంచిన చంద్రబాబు కనీసం ఎన్టీఆర్ ని ప్రచారం కోసం కూడా వాడుకోలేదు అయితే ఈసారి ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ ని ఎలా ఒప్పించాలా అని ఆలోచన చేస్తున్న బాబు కి హరికృష్ణ మరణం కలిసివచ్చింది తన బావ హరికృష్ణ చనిపోవడంతో ఎన్టీఆర్ వెన్నంటే ఉన్నాడు బాబు అంతేకాదు కళ్యాణ్ తో కూడా క్లోజ్ గా మాట్లాడుతూ మీకు నేనున్నాను అనే భరోసా కూడా ఇచ్చేశారు..ఇక్కడే బాబు తన బుర్రకి పదును పెట్టారట..

Nandamuri Kalyan Ram To Participate In AP Elections From Chandragiri-

అసలే విజయాలు లేక లాస్ లో ఉన్న కళ్యాణ్ రామ్ ని రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానం ఇచ్చేశారట అయితే అది కూడా ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ తనకి గెలుపు అందనివ్వకుండా ఇబ్బంది పెడుతున్న చంద్రగిరి నుంచీ కళ్యాణ్ రామ్ ని పోటీ చేయించడానికి డిసైడ్ అయ్యారట చంద్రగిరిలో టీడీపీ ని ప్రజలు దూరం పెడుతున్న సమయంలో ఇదేంటి అనుకునేరు ఇక్కడే మూడు రకాలా ఈక్వేషన్స్ పరిగణలోకి తీసుకున్నారట బాబు ఒకటి కమ్మ సామాజికవర్గం అధికంగా ఉండటం రెండు ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణ చనిపోయిన సెంటిమెంట్ మూడు కళ్యాణ్ రామ్ కి ఉన్న సినిమా నేపధ్యం ఫ్యాన్ ఫాలోయింగ్. ఈ మూడు విషయాలని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు కళ్యాణ్ రామ్ కి టిక్కెట్టు ఇవ్వడానికి సిద్దపడ్డారట…అయితే విశ్లేషకులు సైతం చంద్రబాబు ఆలోచనకే ఓటు వేస్తున్నారు చంద్రగిరి గెలుపుకోసం బాబు వేసిన స్కెచ్ వర్కౌట్ అవుతుందని అంటున్నారు. మరి ఏమి జరుగుతుందో వేచి చూడాల్సిందే.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.