నర్తనశాల.. పంట పండినట్లే     2018-08-21   14:01:40  IST  Ramesh Palla

టాలీవుడ్‌లో ఈమద్య కాలంలో సినిమాలు తెరకెక్కించడం కంటే ఆ సినిమాలను సరైన సమయంలో విడుదల చేయడం పెద్ద టాస్క్‌ అయ్యింది. ఎంత కష్టపడి తెరకెక్కించినా కూడా సరైన సమయంలో విడుదల చేయడంలో విఫలం అయితే ఖచ్చితంగా సినిమా ఫలితాన్ని దెబ్బ కొడుతుందని గతంలో పలు సినిమాలు నిరూపితం చేశాయి. సినిమా యావరేజ్‌గా ఉన్నా కూడా మంచి సమయంలో విడుదల చేస్తే ఖచ్చితంగా మంచి వసూళ్లు నమోదు అవుతాయి. ఈ విషయం కూడా గతంలో పలు సార్లు నిరూపితం అయ్యింది. అందుకే సినిమా తీసేప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటారో తెలియదు కాని, విడుదల విషయంలో మాత్రం ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు.

Naga Shourya Narthanasala Movie Release Date-

Naga Shourya Narthanasala Movie Release Date

చిన్న చిత్రంకు సోలో రిలీజ్‌ అనేది ఈమద్య కాలంలో ఏ సినిమాకు దక్కడం లేదు. కాని ఈసారి ‘నర్తనశాల’కు ఆ అవకాశం దక్కబోతుంది. ఈనెల 30న నర్తనశాల విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. సినిమాకు భారీ ఎత్తున పబ్లిసిటీ చేయడంతో పాటు ‘ఛలో’ సెంటిమెంట్‌తో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అయితే ఈ చిత్రం విడుదలైన తర్వాత రోజే ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రం విడుదల అవ్వాల్సి ఉంది. దాంతో ఇన్ని రోజులు నర్తనశాల చిత్ర యూనిట్‌ సభ్యులు టెన్షన్‌ పడుతున్నారు.

Naga Shourya Narthanasala Movie Release Date-

కేరళలో భారీ వర్షాల కారణంగా ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రం విడుదల వాయిదా వేయడం జరిగింది. రీ రికార్డింగ్‌ వర్క్‌ పూర్తి కానందున శైలజ రెడ్డి అల్లుడు వాయిదా పడ్డట్లే అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు. ఒకవేళ శైలజ రెడ్డి అల్లుడు చిత్రం విడుదల వాయిదా పడితే మాత్రం నర్తనశాల పంట పండినట్లే. గీత గోవిందం చిత్రం అప్పటి వరకు కాస్త జోరు తగ్గనుంది. ఇక ఈ వారం విడుదల కాబోతున్న నాలుగు చిత్రాల్లో ఏ ఒక్కటి కూడా పెద్దగా అంచనాలు లేకుండానే వస్తున్నాయి.

గీత గోవిందం కలెక్షన్స్‌ సందడి ముగియనున్న నేపథ్యంలో నర్తనశాల రిలీజ్‌ అయితే ఖచ్చితంగా సినిమాకు భారీ వసూళ్లు నమోదు అవుతాయి అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. మొత్తానికి నర్తనశాల చిత్రంకు మంచి అవకాశం దక్కింది. మరి ఈ అవకాశంను వినియోగించుకుంటుండా లేదా అనేది చూడాలి.