విజయ్‌ దేవరకొండపై సంచలన వ్యాఖ్యలు చేసిన నాగశౌర్య.. ఆ తర్వాత మాట మార్చాడు  

నాగశౌర్య హీరోగా ‘నర్తనశాల’ చిత్రం తెరకెక్కి, నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. నర్తనశాల చిత్రం ప్రమోషన్‌లో భాగంగా నాగశౌర్య మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. టాలీవుడ్‌లో ఇకపై కొత్తగా స్టార్‌ హీరోలు పుట్టరు అని, రామ్‌ చరణ్‌తోనే ఆ స్టార్‌ స్టేటస్‌ అనేది ఆగిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు. ఈమద్య కాలంలో విజయ్‌ దేవరకొండను స్టార్‌ హీరో అంటూ అందరు సంబోధిస్తున్న కారణంగానే నాగశౌర్య ఈమాట మాట్లాడినట్లుగా అంతా అనుకుంటున్నారు.

‘గీత గోవిందం’ చిత్రంతో విజయ్‌ దేవరకొండ ఏకంగా 100 కోట్లను వసూళ్లు చేశాడు. దాంతో విజయ్‌ దేవరకొండకు స్టార్‌ స్టేటస్‌ దక్కినట్లే అంటూ ప్రేక్షకులు అంటున్నారు. చిరంజీవి కూడా ఇకపై విజయ్‌ దేవరకొండ స్టార్‌ హీరో అంటూ అన్నాడు. ఇప్పుడు అదే విషయమై నాగశౌర్య అనడంతో విజయ్‌ను టార్గెట్‌ చేసి చేసిన వ్యాఖ్య అంటూ అందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే నాగశౌర్య మరోసారి తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చాడు.

Naga Shaurya Targets Vijay Devarakonda-

Naga Shaurya Targets Vijay Devarakonda

స్టార్‌డం అనేది ఒకటి రెండు సినిమాలకు రాదు, చిరంజీవి గారు ఎన్నో చిత్రాలు చేస్తే కాని వచ్చింది. స్టార్‌ హీరో అయిన పవన్‌ మూవీ ఫ్లాప్‌ అయినా కూడా మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టగలదు. ఇలాంటి వారు మాత్రమే స్టార్‌ హీరోలు అనేది తన అభిప్రాయం అని, తన వ్యాఖ్యలను వక్రీకరించి, విజయ్‌ దేవరకొండను తాను అలా అన్నట్లుగా కొందరు సృష్టిస్తున్నారు అంటూ నాగశౌర్య ఆగ్రహం వ్యక్తం చేశాడు.

విజయ్‌నే కాదు, తాను ఏ హీరోను ఉద్దేశించి ఆ మాటలు అనలేదు అంటూ శౌర్య చెప్పే ప్రయత్నం చేశాడు. కాని నష్టం జరిగిపోయిన తర్వాత ఎంత అయ్యో అంటే ఏం ప్రయోజనం చెప్పండి.