బాబు చాణిక్యం .. జూనియర్ ని చేరదీస్తాడా .. రాజకీయ లబ్ది పొందుతాడా     2018-08-30   12:58:38  IST  Sai Mallula

అపార చాణిక్యుడిగా పేరుపొందిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయం ఎవరికీ అంత తేలిగ్గా అర్ధం కాదు. సమయానుకూలంగా రాజకీయ ఎత్తుగడలు వేస్తూ… అందరిని ఆశ్చర్యపరచడం చంద్రబాబుకి బాగా అలవాటు. ఇక వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎన్నికల పోరు రస్వత్రంగా ఉండబోతోంది. మూడు ప్రధాన పార్టీల మధ్య పోరు నువ్వా నేన అనే స్థాయిలో ఉండబోతోంది. ఈ దశలో అధికార పార్టీ టీడీపీ కి గెలుపు సందేహం బాగా పట్టుకుంది. ఎన్నికల్లో ఎలా అయినా గట్టెక్కాలని చూస్తున్న బాబు ఇప్పుడు ఓ సరికొత్త ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. తన బావ హరి కృష్ణ ఆకస్మిక మరణంతో నందమూరి ఫ్యామిలీకి దగ్గరైన ఆయన హరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ ను మళ్ళీ చేరదీసి టీడీపీ కి అనుకూలంగా ప్రచారం చేయించే అవకాశం కనిపిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

N Chandrababu Naidu Parting Ways With Jr NTR-

N Chandrababu Naidu Parting Ways With Jr NTR

ఇక జూనియర్ విషయానికి వస్తే… ఆయన బాబు ఎన్ని రకాలుగా జూనియర్ ని దూరం పెట్టినా ఆయన మాత్రం తన కట్టే కాలే వరకు టీడీపీని వదిలే ప్రసక్తి లేదని చెప్పడం బాబు కి బాగా కలిసొచ్చే అంశం. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఛరిష్మాలతో ఎన్నికల బరిలో టీడీపీ జెండా ఎగురవేసింది. అయితే ప్రస్తుతం పవన్ టీడీపీ కి దూరం అయ్యి సొంతంగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నాడు. ఈ దశలో ప్రజల్లో ప్రభావం చూపించగలిగిన వారు టీడీపీ కి అవసరం. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ని చేరదీసేందుకు బాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు టీడీపీ లో చిన్నపాటి చర్చ మొదలయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలోకి వస్తే ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోయే ఛాన్స్ ఉంటుంది.

N Chandrababu Naidu Parting Ways With Jr NTR-

మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది నందమూరి అభిమానులు టీడీపీ కి దూరంగా ఉంటున్నారు. జూనియర్ రాకతో వారంతా టీడీపీ కి సపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. అంతే కాకుండా ఆయన సినీ అభిమానులు కూడా కలిసివస్తారని తద్వారా రాజకీయ లబ్ది పొందవచ్చని టీడీపీ అధినేత ఆలోచన. ఒకవేళ జూనియర్ ని దూరం చేసుకుంటే ఆ స్థాయిలో ఓటర్లను ప్రభావం చేసే శక్తి టీడీపీ లో ఎవరికీ లేదు. ఇక లోకేష్ సంగతి అయితే చెప్పనవసరం లేదు. ఆయన వల్ల టీడీపీ కి నష్టమే తప్ప లాభం లేదు అనే సంగతి బాబు కి కూడా తెలుసు అందుకే జూనియర్ ఎన్టీఆర్ ని చేరదీసి బాబు చక్రం తిప్పే ఛాన్స్ కనిపిస్తోంది.