వరుసగా ఏడోసారి నెం.1 స్థానంలో నిలిచిన అపరకుబేరుడు అంబానీ ..రోజువారి సంపాదన 300కోట్లు..   Mukesh Ambani Ranked First For The 7th Time In Barclays Hurun India     2018-09-26   11:19:02  IST  Rajakumari K

దేశంలో అత్యంత శ్రీమంతుడిగా ముకేష్ అంబానీ మళ్లీ చోటు దక్కించుకున్నారు.. ఇటీవల బార్క్ లేస్ – హురూన్ ఇండియా అత్యంత ధనవంతుల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో తొలి స్థానం ముకేష్ అంబానిదే..వరుసగా ఏడోసారి ముకేశ్ తొలిస్థానాన్ని దక్కించుకున్నారు.ప్రస్తుతం అతడి సంపాదన. రూ.3,71,000 కోట్లు.ఆయన తర్వాత రూ.1,59,000 కోట్లతో ఎస్‌పీ హిందుజా కుటుంబం 2వ స్థానంలో, రూ.1,14,500 కోట్లతో లక్ష్మీనివాస్ మిట్టల్ కుటుంబం 3వ స్థానంలో, రూ.96,100 కోట్లతో అజీం ప్రేమ్‌జీ 4వ స్థానంలో నిలిచారు.

గతేడాది సెకనుకు రూ.35 వేలు.. నిమిషానికి రూ.21 లక్షలు.. గంటకు రూ.12.5 కోట్లు.. రోజుకు రూ.300 కోట్లుగా వుంది ముకేష్ రోజూవారి ఆదాయం. ఈసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ విలువ 45 శాతానికిపైగా పెరిగి ముకేశ్ అంబానీ సంపదను అమాంతం పెంచేసిందని బార్క్‌లేస్ అభిప్రాయపడింది. ఇక కుటుంబ ఆస్తుల్లో చూస్తే అంబానీల సంపద రూ.3,90,500 కోట్లుగా ఉంది.. దేశంలో రూ. 1,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ సంపద కలిగిన భారతీయుల సంఖ్య 34 శాతం వృద్ధి చెంది 831కు చేరింది. 2016లో ఈ సంఖ్య 339 మంది మాత్రమే కావడం గమనార్హం.

టాప్-10లో చివరి ఆరు స్థానాల్లో…

దిలీప్ సంఘ్వీ (రూ.89,700 కోట్లు)

ఉదయ్ కొటక్ (రూ.78,600 కోట్లు)

సైరస్ పూనవాలా (రూ.73,000 కోట్లు)

గౌతమ్ అదానీ కుటుంబం (రూ.71,200 కోట్లు)

సైరస్ పల్లోంజీ మిస్త్రీ (రూ.69,400 కోట్లు)

షాపూర్ పల్లోంజీ మిస్త్రీ (రూ.69,400 కోట్లు) ఉన్నారు.