కొండగట్టు బస్సు ప్రమాదం నుండి బయటపడి తల్లిని కోల్పోయిన ఓ చిన్నారి సంచలన కామెంట్స్.! కండక్టర్ ఏమన్నారంటే.?   Chinnari Archana Comments On Kondagattu Bus Accident     2018-09-15   11:01:50  IST  Sainath G

జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చించి. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ శ్రీనివాస్‌తో పాటు 62 మందికి పైగా ప్రాణాలు కొల్పోయారు. మరికొందరు ప్రాణాలతో పోరాడుతున్నారు. అయితే ఈ ప్రమాదం పూర్తిగా ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించి స్పందించారు గాయాలతో బయటపడ్డ కండక్టర్‌ పరమేశ్వర్‌.

బస్సు ఫిట్‌నెస్‌ సరిగా లేకపోవడంతో.. ఘాట్‌ రోడ్డులో బ్రేక్‌ ఫెయిల్‌ అయి ఉంటుందని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో తాను బస్సు చివరలో ఉన్నానని చెప్పారు. ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్‌ గట్టిగా అరిచాడని తెలిపారు. బస్సు కండీషన్‌ పై, ప్రయాణికుల రద్దీపై ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎవరు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు బస్సులో మొత్తం 114 మంది ఉన్నారని.. అందులో 96 మందికి టికెట్‌ ఇచ్చానని చెప్పారు. నలుగురు చిన్నపిల్లలు కాగా, ఏడు ఎనిమిది మందికి పాసులు ఉన్నాయని.. జెఎన్టీయూ వద్ద బస్సు ఎక్కిన ఆరుగురికి ఇంకా టికెట్లు ఇవ్వలేదని ఆయన గుర్తుచేసుకున్నారు.

Chinnari Archana Comments On Kondagattu Bus Accident-

అంతేకాదు ఈ ప్రమాదంనుండి బయటపడిన అర్చన అనే పదమూడు ఏళ్ల చిన్నారి ఏమని స్పందించింది అంటే…‘బ్రేక్‌లు ఫెయిలయ్యాయి. దూకేవారు కిందకు దూకేయండి’ అంటూ డ్రైవర్‌ బిగ్గరగా అరిచాడు అని పేర్కొంది. ‘డ్రైవర్‌ మాటలతో ఆందోళనకు గురై.. ఓ వ్యక్తి బస్సులోంచి దూకడంతో అతని మొహం నుజ్జునుజ్జయింది. భయంతో కేకలు వేస్తూ అందరూ ఒకరిపై మరొకరు పడ్డారు. ప్రమాదానికి ముందు.. నేను, మా అమ్మ దిగిపోతామని చెప్పినా కండక్టర్‌ వినిపించుకోలేదు. ఈ విషయమ్మీద మా అమ్మతో కండక్టర్‌ కాసేపు గొడవ పడ్డాడు’ అని వివరించింది. కండక్టర్‌ బస్సును ఆపివుంటే.. మా అమ్మ మాకు దక్కేది అని కన్నీళ్లు పెట్టుకుంది.