మోక్షజ్ఞ ఎంట్రీ.. బాలయ్యపై ఫ్యాన్స్‌ ఆగ్రహం   Mokshagna To Debut In NTR's Biopic     2018-09-07   10:23:07  IST  Ramesh P

నందమూరి ఫ్యామిలీ నుండి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్‌ 2014 సంవత్సరం నుండి ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. మోక్షజ్ఞను హీరోగా చేస్తాను అంటూ చాలా కాలం క్రితమే ప్రకటించిన బాలకృష్ణ ఇప్పటి వరకు అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లుగా అనిపించడం లేదు. కనీసం 2020వ సంవత్సరంలో అయినా మోక్షజ్ఞ ప్రేక్షకుల ముందుకు వస్తాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ ‘ఎన్టీఆర్‌’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ చిత్రంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయం అంటూ ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్‌ చిత్రంలో మోక్షజ్ఞ ఉంటాడా లేదా అనే విషయంలో ఇంకా అధికారిక క్లారిటీ రాలేదు. చిన్న పాత్రతో కాకుండా పూర్తి స్థాయి హీరోగానే మోక్షజ్ఞను పరిచయం చేయాలని బాలయ్య భావిస్తున్నాడు అంటూ కొందరు అంటున్నారు. అయితే మోక్షజ్ఞ విషయంలో బాలయ్య ఆలోచన ఏంటో తెలియడం లేదు. గత కొంత కాలంగా మోక్షజ్ఞ నటనలో శిక్షణ తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కాని మోక్షజ్ఞ మాత్రం చాలా లావుగా తయారు అవుతున్నాడు. దానికి తోడు మోక్షజ్ఞలో హీరో ఫీచర్‌లు లేవు అంటూ యాంటీ నందమూరి ఫ్యాన్స్‌ విమర్శలు చేస్తున్నారు.

మోక్షజ్ఞను తీసుకు వస్తే అఖిల్‌ పరిస్థితే అతడికి కూడా ఎదురవుతుందని బాలయ్య భావిస్తున్నాడు అని, అందుకే ఇంత ఆలస్యం చేస్తున్నట్లుగా కొందరు భావిస్తున్నారు. మొత్తానికి బాలకృష్ణ తీరుపై ఫ్యాన్స్‌లోనే అసహనం వ్యక్తం అవుతుంది. కొడుకును హీరోగా తీసుకు రావడంలో ఈయన విఫలం అవుతున్నాడు అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Mokshagna To Debut In NTR's Biopic-

ఇప్పటికే చిరంజీవి వారసుడిగా చరణ్‌, నాగార్జున వారసుడిగా నాగచైతన్య హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. త్వరలోనే వెంకటేష్‌ వారసుడు కూడా వస్తాడేమో. ఇలాంటి సమయంలో మోక్షజ్ఞ ఇంకా కూడా హీరోగా రెడీ అవ్వడం లేదు ఎందుకు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు మోక్షజ్ఞ హీరోగా వస్తాడా లేదా అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణాల వల్లే బాలయ్యపై ఫ్యాన్స్‌ ఆగ్రహంతో ఉన్నట్లుగా సమాచారం అందుతుంది.