'ఫసక్' పై వచ్చిన ట్రోల్ల్స్ పై 'మోహన్ బాబు' ఎలా స్పందించారో తెలుసా.? ఇకనైనా ట్రోల్ల్స్ తగ్గుతాయా.?   Mohan Babu Trolls On English Translation In Social Media Pasak     2018-09-04   09:51:39  IST  Sainath G

మంచు ఫ్యామిలీకి సోషల్ మీడియాలో ఉన్న రెప్యుటేషన్ ఎలాంటిదన్నది అందరికీ తెలిసిందే. ఈ విషయంలో మంచు మోహన్ బాబు సైతం ఇటీవలే ఒక కార్యక్రమంలో ఓపెన్ గా మాట్లాడేశారు. తమ గురించి తమాషా చేస్తూ పెట్టిన వీడియోలవీ చూస్తుంటానని సరదాగానే మాట్లాడారు. మంచు లక్ష్మి ఈ విషయంపై ఒక సందర్భంలో చాలా సీరియస్ గా స్పందించింది. అయితే మంచు కుటుంబ సభ్యులు స్పందన ఎలా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం వాళ్ల మీద మీమ్స్ ఆగట్లేదు. వాళ్ళు ఎక్కడ దొరుకుతారు అని ఎదురు చూసే జనాలు .. ఏ చిన్న ఆవకాశం దొరికిన చెలరేగిపోతుంట. ఇటీవలే మోహన్ బాబు అలాగే దొరికేశారు.

కొద్దీ రోజుల క్రితం ఓ మీడియాకు మోహన్ బాబు తన సినీ ప్రస్థానం గురించి చిన్నపాటి ఇంటర్వ్యూ ఇచ్చారు. తన నటనలో ప్రత్యేకతను చాటిచెప్పడానికి ఎం. ధర్మరాజు ఎం.ఏ సినిమాలోని ఒక సన్నివేశాన్ని ఉదాహరణంగా చెప్పారు. అందులో తాను తన భార్యనే చంపమనే డైలాగ్ చెప్పి.. దాన్ని ఇంగ్లీష్ లోకి అనువదించి చెప్పడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒక్క దెబ్బతో చంపేయాలి అనే మాటను ఇంగ్లీష్ లోకి అనువదిస్తూ … ”డోంట్ కిల్ సో మెనీ టైమ్స్ లైక్ దిస్.. ఓన్లీ ఒన్స్ ఫసక్” అన్నారు. అంతే ఈ ఫసక్ అనే మాట ట్రోలర్స్ పట్టుకున్నారు. దీని మీద ఇబ్బడి ముబ్బడిగా మీమ్స్ వచ్చేసాయి. అవి సోషల్ మీడియాలో జనాలకు మాములుగా ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వట్లేదు. యూట్యూబ్ లోకి వెళ్లి ”ఫసక్” అని కొడితే కుప్పలు కుప్పలుగా మీమ్ వీడియోస్ వస్తున్నాయి.

తనపై వస్తున్న ట్రోలింగ్ కు ఆగ్రహం వ్యక్తం చేయకుండా కూల్ గానే సమాధానం ఇచ్చి అందరిని ఆశ్చర్యపర్చాడు. ఫసక్ అనే పదం సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం మంచిగా అనిపించింది. ఫసక్ పదంపై దాదాపు 200 ఫన్నీ వీడియోలు వచ్చినట్లుగా విష్ణు చెప్పాడు. అందులో కొన్ని చూశాను. చాలా ఫన్నీగా ఉన్నాయి అంటూ పోస్ట్ చేశాడు. ఫసక్ ట్రోలింగ్ ను కాస్తయినా తగ్గించుకునేందుకు మోహన్ బాబు ఇలా పోస్ట్ చేసి ఉంటాడు అంటూ టాక్ వినిపిస్తుంది. మోహన్ బాబు ఫన్నీగా తీసుకున్న కారణంగా ట్రోలింగ్ తగ్గే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. ఇప్పటికైనా మోహన్ బాబు ఫసక్ పదంపై ట్రోల్స్ ఆగుతాయో చూడాలి.