కోట్లు ఉన్నాయా .. అయితే సీటు మీకే .. అన్ని పార్టీలు ఇంతే

ప్రస్తుత రాజకీయాలన్నీ కోట్లు చుట్తోనే తిరుగుతున్నాయి.కోట్లాది రూపాయలు కుమ్మరించే స్థోమత ఉంటేనే పార్టీల టికెట్లు ఆశయించాలి తప్ప నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేస్తాం .

 Mla And Mp Seats Very Cost In Andhra Pradesh Politics-TeluguStop.com

టికెట్ ఇవ్వండి అంటే ఏ పార్టీ కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు.అవునియూ రాజకీయాలు బాగా కాస్ట్లీ అయిపోయాయి.

గతంలో సామాన్యులు కూడా రాజకీయాల్లో కి వచ్చి ప్రజాప్రతినిధులు అయ్యారు.కానీ ఇప్పుడు ఎమ్యెల్యే అవ్వాలంటే కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టడమే కాకుండా పార్టీకి భారీగా డొనేషన్ ఇచ్చే స్థోమత ఉండాలి.

అలాంటి అర్హత ఉంటేనే టికెట్ కోసం పోటీ పడాలి అనే పరిస్థితికి నేటి రాజీకీయాలు దిగజారిపోయాయి.

ఏపీలో పరిస్థితి చూసుకుంటే.ఘన చరిత్ర ఉన్న టిడిపి తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కనీసం రూ.50కోట్ల నుంచి రూ.100కోట్లు ఖర్చు పెట్టగల స్థోమత ఉన్నవారే పోటీ పడే పరిస్థితులు ఉన్నాయి.రాజ్యసభకు ఎంపిక చేసిన వారందరూ వందల కోట్లుకు అధిపతులే.

సామాన్య మధ్య తరగతి నుంచి రాజకీయంగా ఎదిగిన వారిలో అతి కొద్ది మంది మాత్రమే కోటీశ్వర్వులు అయ్యారు.త్వరలో జరగనున్న లోక్‌సభ సభ్యుడుగా పోటీ చేయాలంటే రూ.100 నుంచి రూ.200 కోట్లు…ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే రూ.50 కోట్లు నుంచి రూ.100కోట్లు ఖర్చు పెట్టగలిగిన వారై ఉండాలి.ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా…అభివృద్ధి చేసినా.ఎన్నికల్లో ఓట్లు వేసే పరిస్థితులులేవని పార్టీలు నమ్ముతున్నాయి.

ప్రతిపక్ష వైసీపీ కూడా తక్కువేమి తినలేదు.తమ పార్టీ తరపున పోటీ చేయాలంటే.

పార్టీలో పనిచేసిన అనుభవం అవసరం లేదని.సొమ్ములు ఖర్చు చేసేవారికి మాత్రమే టికెట్ అని చెప్పేస్తున్నారు.

పార్టీ పట్ల విధేయత ఉన్నా.టిక్కెట్‌ ఇచ్చే పరిస్థితి లేదు.టిడిపి అభ్యర్థులు రూ.100 కోట్లు ఖర్చు చేస్తారు.మీరు కనీసం రూ.50కోట్లు అయినా ఖర్చు చేయగలరా.అని ‘జగన్‌’ తన వద్దకు వచ్చిన వారిన అడుగుతున్నారట.దీనికి నిదర్శనమే గుంటూరు జిల్లా చిలకలూరిపేట అభ్యర్థి ఎంపిక అని వారు చెబుతున్నారు.

ఇప్పటికే టిడిపిలో కనీసం వంద మందిపైగా రూ.20, రూ.50, రూ.100, రూ.200కోట్లు ఖర్చుపెట్టగలిగిన స్థోమత ఉన్న నాయకులున్నారని అటువంటి వారినే పార్టీనేత చంద్రబాబు ప్రోత్సహిస్తున్నట్లు మధ్యతరగతికి చెందిన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆర్ధిక బలవంతులైన టిడిపి అభ్యర్థిని ఎదుర్కోవాలంటే వారి కంటే ఎక్కువ ఖర్చు పెట్టేవారు కావాలని జగన్‌ కోరుకుంటున్నారట.

ఇక కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన జనసేన పరిస్థితి కూడా ఈ విధంగానే ఉందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube