పెళ్లి తర్వాత తొలిసారిగా అఖిలప్రియ దంపతులు..ఏం చేసారో తెలుస్తే అభినందించకుండా ఉండలేరు.!

మంత్రి అఖిలప్రియ వివాహం ఇటీవల భార్గవ్ తో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.కాగా.

 Minister Akhila Priya Couples After Marriage-TeluguStop.com

వివాహం అనంతరం ఈ నూతన దంపతులు తొలిసారిగా కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.కర్నూలు కడప కాలువ చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించేందుకు కృషి చేస్తామని ఏపి మంత్రి అఖిల ప్రియ రైతులకు హామీ ఇచారు.

కర్నూల్ కడప కాలువ పరిదిలోని నంద్యాల మండలం అయ్యలూరు నుండి బందిఅత్మకూర్ మండలం సంతజూటుర్ పిక్ అప్ ఆనకట్ట వరకు కేసి పరివాహక ప్రాంతాన్ని ఆమె సోమవారం సాయంత్రం పరిశీలించారు.

మంగళవారం కర్నూలు జిల్లాలోని రుద్రవరం గ్రామ సమీపంలోని పాములేటి అనే రైతు పొలంలో మంత్రి, ఆమె భర్త భార్గవ్ రామ్ నాయుడు వరినాట్లు వేశారు.ఈ పరిధిలోని రైతుల సమస్యలను ఆమె ఈ సందర్బంగా అడిగి తెలుసుకున్నారు.ఎకరాకు ఎంత కూలీ ఇస్తున్నారు? అని ఆరా తీశారు.కొత్త దంపతులు ఇలా తమతో కలిసి పనిచేయడంతో కూలీలు సంతోషం వ్యక్తం చేశారు.కాగా.ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది ఖరిఫ్ లో వర్షా భావ పరిస్తులవల్ల సాగునీటి వినియోగం పెరిగిందన్నారు.దీనికి తోడు నాన్ ఆయకట్టు కూడా విపరీతంగా పెరగడం వల్ల టైల్ ఎండ్ కి నీటి సరఫరా తగ్గుతోన్దన్నారు.దీనికి తోడు కాల్వ వెంబడి లీకేజె లు ఉండటంతో నీటి వృధా జరుగుతోందన్నారు.

ఆయకట్టు పరిధిలో ఆయకట్టు రెండులక్షల అరభై వేల ఎకరాలు వుండగా నాన్ ఆయకట్టు రెండులక్షలు ఉందన్నారు.గతంలో దివంగత ఎం ఎల్ ఎ భూమ నాగిరెడ్డి ప్రతి పాదన మేరకు వర్షాభావ పరిస్తుతలలో శ్రీశైలం 790 అదుగుల వద్ద సుంకేసుల కు ఎత్తిపోతల ద్వార నీటి సరఫరా చేయాలనీ ప్రభుత్వాన్ని కోరుతామన్నారు.

ముచుమర్రి వద్ద మరో రెండు లిఫిటింగ్ పంపులు ఏర్పాటు చేసి సాగు నీటి సమస్యలు లేకుండా చేస్తామని ఈ సందర్బంగా మంత్రి అఖిల రైతులకు హామీ ఇచారు.పర్యటనలో మంత్రి వెంట ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ బివి రామిరెడ్డి రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube