అందమైన ముఖ చర్మానికి పాల పేస్ పాక్స్     2018-08-11   10:24:40  IST  Sai Mallula

ముఖ ఛాయ అందంగా ఉంటే వారిలో ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రతి ఒక్కరు ముఖం అందంగా ఉండాలని కోరుకుంటారు. అయితే అందమైన ముఖం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు మరియు ఎంతో డబ్బును ఖర్చు చేసేస్తూ ఉంటారు. ఆలా కాకుండా మనకు చాలా సులభంగా దొరికే పాలతో అద్భుతంగా మన చర్మ ఛాయను మెరుగు పరచుకోవచ్చు. ఇప్పుడు ఆ పాక్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

Milk Face Packs-

Milk Face Packs

పాలు, గులాబీరేకుల ప్యాక్
పాలలో గులాబీ రేకులను వేసి రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం మెత్తని పేస్ట్ గా చేసి గందం పొడి వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పాలు, బాదం ప్యాక్
రాత్రి సమయంలో పాలలో బాదం పప్పును నానబెట్టి మరుసటి రోజు ఉదయం మెత్తని పేస్ట్ గా చేసి పెరుగు వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

Milk Face Packs-

పాలు,తేనే ప్యాక్
పచ్చిపాలలో తేనే వేసి బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అపట్టించి పావు గంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పాలు,నిమ్మరసం ప్యాక్
మూడు స్పూన్ల పాలలో ఒక స్పూన్ తేనే,మూడు లేదా నాలుగు చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అపట్టించి పావు గంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన ముఖంపై పిగ్మెంటేషన్ సమస్య తగ్గుతుంది.