ఎన్టీఆర్‌ లో చిరు కోసం మెగా సంప్రదింపులు     2018-08-09   11:15:19  IST  Ramesh Palla

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తూ, నిర్మిస్తున్న ఎన్టీఆర్‌ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ అనగానే హేమా హేమీలను చూపించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏయన్నార్‌, చంద్రబాబు నాయుడు, సావిత్రి, చిరంజీవి ఇంకా పలువురు నటీనటులను చూపించేందుకు క్రిష్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్టీఆర్‌ సినీ మరియు రాజకీయ జీవింతంలో ముఖ్యమైన వారినందరిని కూడా క్రిష్‌ కవర్‌ చేయబోతున్నాడు.

Megastar Chiranjeevi To Act In NTR Biopic-

Megastar Chiranjeevi To Act In NTR Biopic

ఇప్పటికే ఏయన్నార్‌ పాత్రకు గాను సుమంత్‌ను, చంద్రబాబు నాయుడు పాత్రకు రానాను, లక్ష్మీ పార్వతి పాత్రకు ఆమనిని, శ్రీదేవి పాత్రకు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను, సావిత్రి పాత్రకు కీర్తి సురేష్‌ను ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో మరికొన్ని ముఖ్యమైన పాత్రలకు నటీనటుల ఎంపిక జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌తో చిరంజీవికి మంచి సంబంధం ఉంది. ఆ సంబంధంతోనే ఇద్దరు కలిసి కూడా నటించారు. అందుకు సంబంధించిన రెండు సీన్లు వేయాలని భావిస్తున్నారు.

మెగా ఫ్యాన్స్‌ను ఎన్టీఆర్‌ సినిమాకు పరుగులు పెట్టించాలి అంటే ఖచ్చితంగా ‘ఎన్టీఆర్‌’ మూవీలో మెగాస్టార్‌ పాత్ర ఉండాలని దర్శకుడు క్రిష్‌ భావిస్తున్నాడు. అందుకు బాలకృష్ణ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. దాంతో ప్రస్తుతం దర్శకుడు క్రిష్‌ మెగాస్టార్‌ చిరంజీవి పాత్రను ఎవరితో చేయిస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాడు. చిరంజీవి ఫ్యామిలీలో వరుణ్‌ తేజ్‌తో క్రిష్‌కు మంచి సన్నిహిత్యం ఉంది.

Megastar Chiranjeevi To Act In NTR Biopic-

కంచె చిత్రంను వరుణ్‌తో క్రిష్‌ చేసిన విషయం తెల్సిందే. అందుకే ఈ చిత్రంలో చిరంజీవి పాత్రను వరుణ్‌ తేజ్‌తో చేయించే విషయమై ఆయన ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. రెండు సీన్స్‌ మాత్రమే కాబట్టి వరుణ్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉంది. అయితే అంతకు ముందు వరుణ్‌ మెగాస్టార్‌ పర్మీషన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చిత్రం పట్ల ఎన్టీఆర్‌ ఎలాంటి వైఖరితో ఉంటాడు అనేది చూడాలి