అయిదు నెలల గర్భిణీ...తన కనుల ముందే భర్త హత్య.! పరువు ముఖ్యమా ప్రాణం ముఖ్యమా.?   Man Stabbed To Death In Broad Daylight In Front Of Wife     2018-09-15   12:26:44  IST  Sainath G

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణం చోటుచేసుకుంది. అత్యంత రద్దీగా ఉండే జ్యోతి హాస్పటల్ సమీపంలో పట్టపగలే వినోభానగర్ కు చెందిన పెరుమళ్ల ప్రణయ్ అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు. 6 నెలల కిందే ప్రణయ్‌కు అమృత అనే యువతితో ప్రేమవివాహం జరిగింది. అమె గర్భవతి కావడంతో స్థానిక గైనకాలజిస్టు దగ్గర చెక్‌అప్‌ కోసం శుక్రవారం తీసుకువచ్చాడు. అయితే భార్యను డాక్టర్‌కు చూపించిన అనంతరం తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ఓ వ్యక్తి వెనకవైపు నుంచి వచ్చి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ప్రణయ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. భర్తను తన కళ్లెదుటే దారుణంగా నరికి చంపటంతో అమృత షాక్‌కు గురైంది. దాడి ఘటన అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయింది.

మిర్యాలగూడకు చెందిన ప్రణయ్, అదే ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మారుతీరావు కుమార్తె ప్రేమించుకున్నారు. ఆరు నెలల క్రితం వారిద్దరూ ప్రేమవివాహం చేసుకున్నారు. ఆ సమయంలో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. అయితే, దీన్ని జీర్ణించుకోలేకపోయిన యువతి తండ్రి మారుతీరావు ప్రణయ్‌ను అంతం చేయాలని కుట్రపన్నాడు. ఈ క్రమంలో సుమారు రూ.10లక్షలు సుపారీ ఇచ్చి ప్రణయ్‌ను హత్య చేయించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

Man Stabbed To Death In Broad Daylight Front Of Wife-

అమృత పట్టణానికే చెందిన మారుతీ రావు( రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి) కుమార్తె, ఆమెను ప్రణయ్‌ వివాహం చేసుకోవడం తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో, వారిద్దరూ ఆరు నెలల కిందట లేచిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటీవలే రిసెప్షన్ కూడా గ్రాండ్‌గా జరిపారు. ప్రేమ వివాహమే యువకుడి హత్యకు కారణమని భావించిన మృతుడి కుటుంబీకులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. జిల్లా ఎస్పీ రంగనాథ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్తితి సమీక్షిస్తున్నారు. ప్రణయ్‌పై కత్తితో దాడి చేసిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Man Stabbed To Death In Broad Daylight Front Of Wife-