మెగాస్టార్‌ కోసం కాస్త తగ్గనున్న సూపర్‌ స్టార్‌!     2018-08-12   13:21:00  IST  Ramesh Palla

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుగుతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సైరా నరసింహా రెడ్డి చిత్రాన్ని వచ్చే వేసవి కానుకగా ఏప్రిల్‌ మొదటి వారంలో విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఏప్రిల్‌ మొదటి వారంను సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ‘మహర్షి’ చిత్రంతో బుక్‌ చేసుకున్న విషయం తెల్సిందే. దాంతో రెండు సినిమాలు క్లాష్‌ అవుతాయేమో అనే భావన కలుగుతుంది.

రెండు పెద్ద సినిమాలు కనీసం రెండు వారాల గ్యాప్‌లో అయినా రావాలి. అప్పుడే రెండు సినిమాలకు సేఫ్‌ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సైరా నరసింహారెడ్డి చిత్ర నిర్మాత రామ్‌ చరణ్‌ ‘మహర్షి’ చిత్ర నిర్మాతలతో మరియు మహేష్‌బాబుతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. కనీసం రెండు వారాలు లేదా పది రోజులు గ్యాప్‌ ఉండేలా రెండు సినిమాల విడుదల తేదీలను ప్రకటిద్దాం అంటూ చరణ్‌ వారితో సంప్రదింపులు జరుపుతున్నాడట.

Mahesh Postponed Maharishi Release For Chiru Syra Narasimha Reddy-

Mahesh Postponed Maharishi Release For Chiru Syra Narasimha Reddy

మెగాస్టార్‌ చిరంజీవి ప్రతిష్టాత్మక మూవీ, దానికి తోడు దాదాపు 150 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న మూవీ అవ్వడం వల్ల మహేష్‌బాబు అండ్‌ టీం తమ సినిమాను కాస్త ఆలస్యంగా విడుదల చేయాలని ఫిక్స్‌ అయినట్లుగా సమాచారం అందుతుంది. ఈ రెండు చిత్రాల మద్య కనీసం రెండు వారాలు ఉండేలా విడుదల తేదీలను ఫిక్స్‌ చేస్తున్నారు. త్వరలోనే రెండు సినిమాల విడుదల తేదీలను ప్రకటించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.

మహేష్‌బాబుతో చరణ్‌కు ఉన్న స్నేహం కారణంగా ఈ ఒప్పందం కుదిరిందని చెబుతున్నారు. దానికి తోడు మహేష్‌బాబు ఎప్పుడు కూడా ఇతర హీరోలతో పోటీ పడవద్దని భావిస్తూ ఉంటాడు. తన మూవీ సోలోగా రావాలని, ఇతర హీరోలతో పోటీగా ఉండవద్దని మహేష్‌ కోరుకుంటాడు కారణంగానే సైరా మూవీ కోసం కాస్త వెనక్కు తగ్గినట్లుగా సమాచారం అందుతుంది.