వైరల్ : స్పృహ తప్పి పడిపోయిన యువతికి స్పృహ తెప్పించి,హస్పటల్లో చికిత్స అయ్యేవరకు తోడు నిలిచిన కుక్క..     2018-08-29   11:41:28  IST  Rajakumari K

విశ్వాసం అనే పదం గుర్తొస్తే చాలు మనకు టక్కున గుర్తొచ్చే పేరు కుక్క..నిజమే మనిషి తన మనిషితత్వం,మానవత్వం మరిచిపోయి మృగంలా తయారవుతున్న నేటి సమాజంలో కుక్కలు మాత్రం తమ బుద్దిని మార్చుకోలేదు..ఇటీవల ఒక బాలికపై రేప్ చేయడానికి వచ్చిన దుండుగుల్ని చీల్చిచెండాడింది ఆ బాలిక పెంపుడుకుక్క..ఇప్పుడు మరో కుక్క తన యజామానురాలు స్పృహ తప్పి పడిపోవడంతో తనని స్పృహలోకి తీసుకొచ్చి,హాస్పటల్ కి వెళ్లేవరకు తనకు తోడుగా నిలిచింది..ఆ కుక్కకి,ఆ యువతికి మధ్య అనుభందం హాస్పటల్ సిబ్బందిని ఆశ్చర్యపరిస్తే ,సోషల్ మీడియాకి ఎక్కిన ఈ వీడియో తెగ వైరలవుతుంది.

Loyal Golden Retriever Refuses To Leave Owner And Rides Ambulance-

Loyal Golden Retriever Refuses To Leave Owner And Rides Ambulance

చైనాలోని హైలాంగ్‌జియాంగ్‌ రాష్ట్రంలోని దాకింగ్‌ నగరంలో చోటుచేసుకున్న భావోద్వేగ సంఘటన అందరిని కదిలిస్తుంది.. ఓ యువతి తన పెంపుడు కుక్కతో బయటికి వెళ్లింది..బయట కొద్దిసేపు తిరిగిన తర్వాత, అనారోగ్యం కారణం చేత స్పృహ తప్పి పడిపోయిందా యువతి..అంతే,పెద్దగా అరుస్తూ చుట్టూ ఉన్నవారు అక్కడికి వచ్చేలా చేసింది.కుక్క అరుపులతో అక్కడికి చేరుకున్న స్థానికులు అంబులెన్స్ కి సమాచారం అందించారు.సమాచారం అందుకున్న అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని,ఆమెను స్ట్రెచర్‌‌పై ఉంచారు…అయితే ఇదంతా జరుగుతున్నంత సేపు కుక్క ఆమె చుట్టే తిరుగుతుంది.

Loyal Golden Retriever Refuses To Leave Owner And Rides Ambulance-

అంతేకాదు కుక్క ఆమెను వదిలిపెట్టకుండా స్ట్రెచర్‌పై చేతులేసి యజమానురాలిని లేపేందుకు ప్రయత్నించింది. దాంతో ఆ యువతి కొద్దిగా స్పృహలోకి వచ్చింది.తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆమెని స్పృహలో ఉంచాల్సిన అవసరం ఉంది.దాన్ని గుర్తించిన అంబులెన్స్‌ సిబ్బంది ఆ కుక్కను అంబులెన్స్‌లోకి ఎక్కించుకున్నారు. ఆస్పత్రి వరకు వెన్నంటి వచ్చిన ఆ శునకం.. యువతికి చికిత్స సమయంలో కూడా పక్కనే ఉంది. ఆమె పూర్తి స్పహలోకి రాగానే ముందుగా ఆ మూగజీవిని ఆప్యాయంగా కౌగిలించుకుంది. ‘మేం పెంపుడు జంతువులను ఆస్పత్రిలోకి అనుమతిచం. కాని పేషంట్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని లోనికి రానిచ్చాం’ అని డాక్టర్లు చెప్పారు..ఈ వీడియో కోసం క్లిక్ చేయండి..