పిల్లలతో జాగర్త …! చిన్నారి ఊపిరితిత్తుల్లో LED బల్బ్, ఎలా వెళ్లిందో తెలుసా?!  

ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు పెద్దవారు చాలా అప్రమత్తంగా ఉండాలి..ఎంత అప్రమత్తంగా ఉన్నా ఆపద ఎప్పుడు ఏ వైపు నుండి వస్తుందో ఎవరికి తెలీదు.ముఖ్యంగా పిల్లలు నోట్లో ఏదన్నా పెట్టుకుంటున్నప్పుడు వారించాలి.మనం చూడకుండా అలాంటి పనులు చేస్తుంటారు. కాబట్టి పిన్నులు,పుల్లలు ,ఇతరత్రా చిన్న వస్తువులు వారికి అందుబాటులో ఉంచకూడదు..ఇలా పొరపాటున బొమ్మను నోట్లో పెట్టుకున్నందుకు ఒక పాప శరీరంలోకి ఏకంగా ఎల్ఇడి బల్బ్ వెళ్లింది..దాని ఫలితంగా ఆ పాప ఆరోగ్యం క్షీణించింది ఆ వివరాలు..

LED Bulb Found In Child's Lungs. Doctors Remove It 2 Minutes-

LED Bulb Found In Child's Lungs. Doctors Remove It In 2 Minutes

ఆరీబా ఖాన్ అనే ఏడు నెలల పాప విపరీతమైన దగ్గు,తీవ్రమైనజ్వరంతో బాధపడుతూ , విడువకుండా ఏడుస్తుండటంతో తల్లి దండ్రులు స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు వైద్యులు ఏవో మందులిచ్చారు కానీ ఉపయోగం లేదు.ఎంత మంది డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లినా ఉపశమనం లేదు.దగ్గి దగ్గి పాప అపస్మారక స్థితికి చేరుకోడంతో తల్లి దండ్రులు బాయ్ జర్బాయ్ వాడియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారికి ఏమైందా? అని డాక్టర్లూ కంగారు పడ్డారు రకరకాల పరీక్షలు చేశారు. బోలెడు మందులిచ్చారు. కానీ నో యూజ్.. చిన్నారి కేమైంది? చివరకు ఆమె దగ్గుకు కారణం కనుగొనడానికి ఆమె ఛాతికి బ్రాంకోస్కోపీ తీశారు. అప్పుడు బయటపడింది ఓ చేదు నిజం చిన్నారి కుడి ఊపిరి తిత్తిలో ఓ ఎల్ ఈడి బల్బు కనిపించింది.మొదట మొబైల్ పిన్ మింగిందేమో అని అనుమానంచిన తల్లిదండ్రులు పాప కడుపులో ఎల్ఇడి బల్బు ఉందన్న విషయం తెలియగానే హతాశులయ్యారు..ఇంతకీ ఆ బల్బు పాప పొట్టలోకి ఎలా వెళ్లిందో తెలుసా..

LED Bulb Found In Child's Lungs. Doctors Remove It 2 Minutes-

సుమారు రెండు సెంటీమీటర్ల వెడల్పు కలిగిన ఈ బల్బు ఆడుకుంటున్న బొమ్మ సెల్ ఫోన్ నుంచి ఊడి ఆరీబాఖాన్ గొంతులోకి జారిపోయింది.ఈ ఎల్ ఈ డి బల్బ్ డాక్టర్లకు అంత సులభంగా కనిపించలేదు. కుడి ఊపిరి తిత్తిలో ఏదో వస్తువు ఉందన్న ఛాయలు మాత్రమే కనిపించడంతో దాదాపు వంద ఎక్స్ రేలు తీశారు. చివరకు అది ఎల్ ఈ డి బల్బ్ గా గుర్తించారు.బాలిక ఊపిరితిత్తిలో ఇరుక్కున్న ఎల్ ఈడీ బల్బును వెలికి తీసేదెలా? శ్వాస నాళాలన్నీ తీవ్రమైన ఇన్ఫెక్షన్ తోనూ, కఫంతోనూ పేరుకుపోయాయి. ఊపిరి తిత్తులు కూడా ఇన్ఫెక్షన్ తో నిండిపోడంతో లోపల ఉన్నదేంటో తెలియలేదు. ఇన్ఫెక్షన్ కంట్రోల్ కావడానికి ముందు యాంటీ బయెటిక్స్ ఇచ్చారు. ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయ్యాక బ్రాంకోస్కోపీ చేయగా ఎల్ ఈ డి బల్బ్ కనిపించింది. ఇంట్రా వీనస్ యాంటీ బయటిక్స్, స్టెరాయిడ్స్ ఇచ్చి ఊపిరితిత్తుల్లో చేరిన ఫంగస్ ను పూర్తిగా అదుపు చేసి ఆ తర్వాత ఫోర్ సెప్ పెట్టి ఆ బల్బ్ ని జాగ్రత్తగా బైటికి తీశారు. వాడియా ఆస్పత్రి ఛైల్డ్ బ్రాంకోస్కోపీలు చేయడంలో దేశంలోకే అగ్రగామిగా పేరుపడింది.