యజమాని ఇంట్లో చోరీ..భారత మహిళపై అనుమానం   Lady NRI Thief Owners Assets In Kuwait     2018-09-13   18:11:31  IST  Bhanu C

దేశం కాని దేశం లో భారతీయ మహిళ ఎన్నో అపవాదులు ఎదుర్కోవలసి వస్తోంది…ఏది నిజమో ఏది అబద్దమో తెలియని పరిస్థితిలో పోలీసులు ఉన్నారు..ఆమెపై వ్యక్తిగతంగా కేసుని నమోదు చేయించారా లేదా..నిజంగానే ఆ మహిళ తప్పు చేసిందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు..అందులో భాగంగానే కువైట్ అంతా పోలీసులు జల్లెడ పడుతున్నారు..ఇంతకీ ఆ మహిళ ఎవరు ఏమి నేరం చేసింది అనే వివరాలలోకి వెళ్తే.

కువైట్ లో ఒక ఇంట్లో పనిమనిషిగా కుదిరిన భారత మహిళ తమ ఇంట్లో ఖరీదైన వాచ్ దొంగతనం చేసిందనే ఫిర్యాదు పోలీసులకి అందించారు..దాంతో కువైట్ పోలీసులు ఆ మహిళా పని చేస్తున్న ఇంటికి వచ్చి యజమానిని విచారించారు..తమ ఇంట్లో పని చేస్తున్న ఆమె దొంగతనానికి పాల్పడిందనే భావిస్తున్నామని మాకు న్యాయం చేయాలని వారు పోలీసులకి తెలిపారు అయితే

Lady NRI Thief Owners Assets In Kuwait-

దొంగతనం జరిగింది అని చెప్తున్న ఆ వాచ్ ఖరీదు 4 వేల కువైట్ దినార్స్ గా నిర్ధారించారు అంటే భారత కరెన్సీ లో రూ.9.5 లక్షలు అయితే దొంగతనం ఫిర్యాదు మాకు అందిందని అయితే ఈ దొంగతనం ఆమె చేసిందా లేదా అనే కోణంలో కేసుని దర్యాప్తు చేస్తున్నామని ఆ భారతీయ మహిళా కోసం గాలిస్తున్నామని..తప్పు చేయని మహిళా అయితే ఎందుకు కనపడకుండా పోయింది అనే కోణంలో కూడా విచారణ చేపట్టామని కువైట్ పోలీసులు తెలిపారు.