జనసేనలోకి ప్రభాస్ ఫ్యామిలీ....   Krishnamraju Joining In To Pawan Kalyan Janasena Party     2018-09-11   15:22:41  IST  Bhanu C

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చర్యలు నిజంగా ఊహాతీతమే..ఎప్పుడు ఎలా ఆట మొదలు పెడుతాడో ఎవరికీ అర్థం కాని పరిస్థితి..అచ్చం సినిమా స్క్రీన్ మీద చూసినట్టుగా నిజజీవిత రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తూ రాజకీయ వేడిని రగుల్చుతున్నాడు..ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జనసేన అధినేత ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాడు..అభ్యర్ధుల విషయంలో కానీ వారి చేరికల విషయంలో కానీ చివరి వరకూ ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించకుండా ఎంతో గోప్యంగా ఉంచుతూ నియోజకవర్గాలో కీలక నేతలని తనవైపుకి తిప్పుకునే విధంగా పవన్ వ్యూహాలు రాజకీయ ఉద్దండులని సైతం కలవరపెడుతున్నాయి.

అయితే తాజాగా ఈరోజు తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నుంచీ పితాని బాలకృష్ణ శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన మాజీ వైసీపీ నేతని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం మాత్రమే కాదు జనసేన తరుపునుంచీ మొదటి బీ ఫార్మ్ ఇస్తానని బహిరంగంగా ప్రకటించాడు..దాంతో తూగో లో పితాని వర్గం సంతోషం వ్యక్తం చేసింది ఇక్కడి వరకూ బాగానే ఉంది అయితే మరొక వార్తా ఇప్పుడు రాజకీయాల్లో సంచలనం కాబోతోంది అంటూ టాక్ వినిపిస్తోంది..ఇంతకీ ఏమిటా సంచలనం అంటే..

పశ్చిమ డెల్టా ప్రాంతంలో అత్యంత బలమైన , ఆర్ధికంగా నిలదొక్కుకున్న ప్రాంతం భీమవరం. అంతేకాదు రాజకీయంగా కీలక నిర్ణయాలు గానీ రాజకీయ ప్రభావం ఉన్న ప్రాంతంగా కూడా మంచి పేరు ఉంది…ఈ ప్రాంతంలో బలమైన సామాజిక వర్గంగా పేరున్న రాజులు మద్దతు ఉంటే చుట్టుపక్కల నియోజకవర్గాలలో కూడా చక్రం తిప్పచ్చని టాక్ కూడ ఉంది దాంతో పవన కళ్యాణ్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు గత కొంతకాలంగా పార్టీ నేతలలో కీలక వ్యక్తులతో సమాలోచనలు చేసిన పవన కళ్యాణ్ జనసేన నరసాపురం ఎంపీ అభ్యర్ధిగా టాలీవుడ్ నాటి హీరో ప్రభాస్ పెదనాన్న అయిన రెబల్ స్టార్ కృష్ణంరాజుని పార్టీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుందనే సమాలోచనలు చేశారట..

Krishnamraju Joining In To Pawan Kalyan Janasena Party-

అందులో భాగంగానే అన్న చిరంజీవితో కృష్ణంరాజు ముందుకు ఈ ప్రతిపాదనని తీసుకుని వెళ్లారట..అయితే చిరజీవిని వెన్ను తట్టి ప్రోత్సాహం అందించిన వ్యక్తులలో కృష్ణంరాజు కూడా ఒకరు..మెగా ఫ్యామిలీ కి రెబల్ స్టార్ ఫ్యామిలీ కి కూడా ఎంతో అవినాభావ సంభంధం కూడా ఉంది..అంతేకాదు రెబల్ సార్ట్ గనుకా జనసేన ఎంపీ గా పోటీ చేస్తే ప్రభాస్ ఫ్యాన్స్ ఓట్లు, మరో పక్క వారి సామాజిక వర్గ ఓట్లు అదేవిధంగా కాపులు , మెగా ఫ్యామిలీ ఓట్లు పడటమే కాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని కూడా తమవైపుకి తిప్పుకోవచ్చు అనే అలొచనలో ఉన్నారట అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా ఈ పక్కా ప్రణాళికని రెబల్ స్టార్ ముందుకి తీసుకుని వెళ్లి వివరించి చెప్పడంతో కృష్ణంరాజు కూడా చూచాయిగా ఒకే చెప్పినట్టుగా తెలుస్తోంది..అదే గనుకా జరిగితే పశ్చిమలో జనసేన జోరుకి తిరుగు ఉండదని విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.