బాబు ఆపరేష్ ఆకర్ష్ మొదలు...బిగ్ వికెట్స్ డౌన్..  

చంద్రబాబు చాణిక్యం ముందు ఎలాంటి రాజకీయ నాయకుడైనా దిగదుడుపే..అప్పటి వరకూ చంద్రబాబు పనైపోయింది అనుకుని సంబరపడిపోయే వాళ్ళు సైతం ఒక్క సారిగా అవ్వాక్కయ్యేలా పరిస్థితులని తనవైపు తిప్పుకునే రాజకీయ దురందురుడు చంద్రబాబు ఒక్కడే అని చెప్పడంలో సందేహం లేదు..బాబు రాజకీయ ఎత్తులు పై ఎత్తులు అన్నీ చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి..అయితే ఈ ఎత్తుల వెనుకాల కేవలం ఉండేది పార్టీ మనుగడ స్వార్ధం తప్ప మరేమీ లేదు అయితే

ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితులు ఏమాత్రం టీడీపీ కి అనుకూలంగా కనిపించడం లేదు..

Kondru Murali To Join In Telugudesam Party-

Kondru Murali To Join In Telugudesam Party

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందో కచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ప్రధాన పార్టీలు అయిన టీడీపీ ,వైసీపీ, జనసేన పార్టీల త్రిముఖ పోరు హోరాహోరీగా ఉండబోతోంది. ఇందులో గెలుపు సాధించాలంటే ప్రత్యర్థి పార్టీలకంటే ధీటుగా పార్టీని బలంగా ఉంచాలి..అందుకే బాబు ఓ సరికొత్త ఆలోచన చేశాడు..గతంలో అమలు చేసిన ఆపరేషన్ ఆకర్ష్ పథకానికి మళ్ళీ తెరలేపేందుకు సిద్ధం అయ్యాడు. దానికి అనుగుణంగా తగిన ప్రణాళిక కూడా సిద్దం చేశారు..సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో చేరికలతో తనదైన వ్యూహాలకు పదునుపెడుతున్నారు..అందులో భాగంగానే చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ -2 మొదలు పెట్టారు..

ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా నుంచి కొండ్రు మురళీని చేర్చుకోవాలని పార్టీలోకి చేర్చుకోవాలని డిసైడ్ చేశారు.. అదేవిధంగా వైజాగ్ నుంచీ సబ్బం హరితోపాటు.. కొణతాల రామకృష్ణ టార్గెట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది..సబ్బం హరికి విశాఖ నార్త్ ఎమ్మెల్యే సీటు, కొణతాలకు అనకాపల్లి పార్లమెంట్ సీటు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది…ఇక తూర్పు గోదావరి నుంచి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ను సైకిలెక్కించుకోవాలని బాబు గట్టి పట్టుదలగా ఉన్నారని టాక్.. రాజమండ్రి ఎంపీ, లేదా ఎమ్మెల్యే సీటు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Kondru Murali To Join In Telugudesam Party-

ఇదిలాఉంటే వైసీపీకి పట్టున్న రాయలసీమ జిల్లా మీద కూడా బాబు ఎక్కువగా దృష్టి పెట్టారు..అందుకే ముందుగా కడప పై ఫోకస్ పెట్టారు బాబు..గతంలోనే ఆదినారాయణ రెడ్డిని పార్టీలొ చేర్చుకొని మంత్రి పదవి కూడా కట్టబెట్టారు..పనిలో పనిగా డీఎల్ రవీంద్రా రెడ్డి ని కూడా పార్టీలోకి తీసుకుంటే కడపలో జగన్ కి ఒక మోస్తరుగా దెబ్బపడినట్టే అంటున్నారు..దాంతో పాటే మాజీ మంత్రి అహ్మదుల్లా కూడా బాబు చెంతకి చేరడానికి సిద్దంగా ఉన్నారనియా తెలుస్తోంది..ఈ క్రమంలోనే కర్నూల్ జిల్లానుంచీ నుంచి మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు..ఈ విధంగా వైసీపీ కి అన్ని జిల్లాల నుంచీ దారులు మూసుకుపోయేలా చేయాలనేది బాబు వ్యూహం గా తెలుస్తోంది..