కేటీఆర్ కి ఉంది ఓ కోటరీ... పట్టు కోసమా .. బల ప్రదర్శనకా   Konda Surekha Calls KTR A Manipulator     2018-09-09   12:51:08  IST  Sai M

తండ్రికి తగ్గ తనయుడిగా .. వారసత్వ రాజకీయాల ద్వారా వచ్చినా ప్రభుత్వంలో తాను ఏంటో నిరూపించుకోవడమే కాకుండా.. షాడో ముఖ్యమంత్రిగా పేరు పొందాడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయుడు కేటీఆర్. తెలనగానలో ప్రభుత్వాన్ని రద్దు చేసినా ఆ తరువాత వచ్చే ఎన్నికల్లో తాను ఖచ్చితంగా గెలుస్తాను అని అప్పుడు తప్పకుండా సీఎం పీఠం ఎక్కుతాను అని కేసీఆర్ చెప్తున్నాడు. అయితే, ఎంత క్లారిటీ ఇస్తున్నా ఆయన కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రి పీఠం ఎక్కిస్తారని, కేసీఆర్ ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్తారనే ప్రచారం కూడా ఉంది.

అసలు ఇంత అర్ధాంతరంగా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి కేటీఆర్ కూడా ఒక కారణం అని తెలంగాణాలో వినిపిస్తున్న మాట. అయితే, కేటీఆర్ ఓ కోటరీని తయారు చేసుకుంటున్నారని టీఆర్ఎస్ పై తిరుగుబావుటా ఎగరవేసిన కొండా సురేఖ ఆరోపించారు. అయితే, టీఆర్ఎస్ లో కేటీఆర్ కు ప్రత్యేకంగా కోటరీ ఉందా అనే అనుమానం ఇప్పుడు వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ కు , కేసీఆర్ కు రాజకీయ వారసుడు కేటీఆర్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. నిజానికి ఆయన తండ్రికి తగ్గ వారసుడే. పాలనలో అనుభవం, అన్ని అంశాల్లో విషయ పరిజ్ఞానం ఇలా ఏ విషయంలో చూసినా కేటీఆర్అ కి మంచి మార్కులే పడుతున్నాయి.

కానీ కేటీఆర్ కంటే ముందు నుంచే హరీష్ రావు కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. పార్టీలో ట్రబుల్ షూటర్ గా కేసీఆర్ అప్పజెప్పిన పనులన్నీ విజయవంతంగా నెరవేర్చారు. కేటీఆర్ కు నాయకత్వం ఇవ్వడానికి హరీష్ రావు అంగీకరించరనే వాదన కూడా నడుస్తోంది. కానీ కేటీఆర్ స్పీడ్ మాత్రం బాగా పెంచేసాడు. ఇటీవల కొంగరకలాన్ లో జరిగిన ప్రగతి నివేదన సభ కూడా కేటీఆర్ ఆధ్వర్యంలోనే జరిగింది. సభ కోసం నియమించిన ఏ కమిటీలోనూ, సభ ఏర్పాట్లలోనూ హరీష్ రావు కనిపించలేదు. అయితే, ఏం జరిగిందో ఏమో కానీ ప్రగతి నివేదన సభ తర్వాత హఠాత్తుగా హరీష్ కు మళ్లీ కొంత ప్రాధాన్యత కనిపిస్తోంది.

Konda Surekha Calls KTR A Manipulator-

ప్రస్తుతం కేటీఆర్ తనకంటూ ఒక సొంతవర్గాని అన్ని జిల్లాల్లో తయారు చేసుకుంటున్నాడు, కేటీఆర్ మాటే వారికి వేదం అన్నట్టుగా ఉన్నవారిని తయారు చేసుకుని పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పార్టీలో ఉన్న తాజా మాజీ ఎమ్యెల్యేలు కేటీఆర్ వెంటే నడిచేలా పరిస్థితులు ఆయనకు అనుకూలంగా మార్చుకున్నాడు. టీఆర్ఎస్ లో చేరిన ఫిరాయింపు తాజా మాజీ ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్ కు దగ్గరగా కనిపిస్తున్నారు. ఏ పని ఉన్నా కేటీఆర్ నే ఆశ్రయిస్తున్నారు. ఇది కోటరీ అని భావించకున్నా కేటీఆర్ మాత్రం తనకంటూ అన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలను తయారుచేసుకున్నారు. ఇప్పుడు కూడా టిక్కెట్ల పంపిణీలోనూ కేటీఆర్ కీలకంగా వ్యవహరిస్తూ ఆయన మనుషులు అందరికీ టిక్కెట్లు ఇప్పించుకున్నారు. అయితే, భవిష్యత్ లో పార్టీ పూర్తిగా కేటీఆర్ కనుసన్నల్లోనే ఉండేలా కేటీఆర్ ప్లాన్ చేసుకుంటున్నాడు.