కోదండరాం గొంతెమ్మ కోర్కెలు..తీర్చగలరా కూటమి పెద్దలు..?   Kodandaram Demands Getting Trouble To Babu And Jagan     2018-09-16   06:02:07  IST  Bhanu C

తెలంగాణలో అసెంబ్లీని రద్దు చేసేసి కొట్టుకు చావండి అనేట్టుగా కేసీఆర్ మిగిలిన పార్టీలని ఒక కుదుపు కుదిపేసి తాను మాత్రం చాలా కూల్ గా తనపని తానూ చేసుకుంటూ వెళ్తున్నాడు..ముందస్తు దెబ్బతో కూటమి కట్టిన కాంగ్రెస్ ,టీడీపీ ,మిగలిన పార్టీలు అన్నీ ఇప్పుడు ఒకే తాటిపైకి వచ్చి కేసీఆర్ పార్టీని కుప్పకూల్చాలి అనే వ్యూహాలలో నిమగ్నమైఉన్న తరుణంలోనే కేసీఆర్ తో పాటు తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం కూటమిలోకి వస్తే కేసీఆర్ ని ఓడించడం పెద్ద కష్టం కాదని డిసైడ్ అయిన కూటమి పెద్దలు ఆ దిశగా చర్చలు జరిగి సక్సెస్ అయ్యారు..

కూటమిలో చేరన కోదండరాం కూటమి పెద్దలకి చుక్కలు చూపిస్తున్నాడట.. తెలంగాణ జన సమితి పేరుతో పార్టీని స్థాపించిన కోదండరాం మొదట్లో హడావిడి చేసినా తరువాత సైలెంట్ గా తన వ్యుహాలని సిద్దం చేస్తూ వచ్చే ఎన్నికలకి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఎన్నికలకి సిద్దం అవుతున్నాడు అయితే తెలంగాణా రాష్ట్ర సాధన నుంచీ ఇప్పటి వరకూ కూడా ఎంతో బలమైన కేడర్ కోదండరాం కి ఉంది..

Kodandaram Demands Getting Trouble To Babu And Jagan-

అంతేకాదు సరిగ్గా కోదండరాం పార్టీ ప్రకటన రాకముందు కోదండరాం పార్టీలోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ,ఇద్దరు మంత్రులు కూడా చేరుతారు అనే టాక్ కూడా వినిపించింది.. దాంతో ఆ వర్గాన్ని తమవైపు తిప్పుకోవడానికి మహాకూటమి పెద్దలు కోదండరాం కోసం వెయ్యి కళ్ళతో వేచి చూశారు.. అయితే అసలు కధ ఇక్కడే మొదలయ్యింది..