'ఈ సారి నాన్న వస్తే...వెళ్లనివ్వను'.! ఉగ్రవాదుల దాడిలో గతేడాది తన తండ్రి మరణించాడని తెలియక ఆ చిన్నారి.!   Killed Kashmir Cop's Daughter Zohra Still Waits For His Return     2018-09-10   10:43:45  IST  Sainath G

గత ఏడాది ఉగ్రవాదుల తూటాలకు ఏఎస్‌ఐ జవాను అబ్ధుల్లా రషీద్ అమరుడయ్యారు. అయితే అతని కుమార్తె జోహ్రా… ఈనాటికీ తండ్రి ఏదో ఒకరోజు తిరిగి వస్తాడని ఎదురు చూస్తోంది. ఈసారి తన తండ్రి ఇంటికివస్తే తిరిగి వెళ్లబోనీయనని రోదిస్తూ చెబుతోంది. టీమిండియా క్రికెటర్‌ గంభీర్‌ ఆమెకు అండగా నిలుస్తానని ప్రకటిస్తూ ఓ ఎమోషనల్‌ సందేశం ఉంచిన విషయం తెలిసిందే.

2017, ఆగస్టు 28న జవాను అబ్ధుల్లా రషీద్… జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదుల తూటాలకు అమరుడయ్యారు. ఆ సమయంలో జోహ్రా రోదిస్తున్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిని చూసిన నెటిజన్లు చలించిపోయారు.

Killed Kashmir Cop's Daughter Zohra Still Waits For His Return-

అమరుడైన జవాను పెద్ద కుమార్తె బిల్కిస్ మాట్లాడుతూ… జోహ్రా తరచూ నాన్న ఎక్కడికి వెళ్లారని అడుగుతుంటుందని తెలిపింది. దీంతో తాము ఆమెను ఊరడించేందుకు నాన్న త్వరలో వస్తారని చెబుతామని తెలిపింది. కాగా వారి మాటలను నమ్ముతున్న జో్హ్రా.. ఈసారి నాన్నవస్తే ఇక ఎక్కడికీ వెళ్లనివ్వనని చెబుతోంది. కాగా తండ్రి అంతిమ సంస్కారాల సందర్భంగా జోహ్రా రోదిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.