కేరళ ప్రవాసులని వెంటాడుతున్న మరో భయం  

గాడ్స్ ఓన్ కంట్రీ లో ప్రకృతి చేస్తున్న విలయ తాండవం మాములుగా లేదు..దాదాపు 380 మంది ఇప్పటి వరకూ చనిపోయారు అంటే ఇంకెంత మంది ప్రమాదాలకి గురయ్యారో చావు బ్రతుకుల్లో కొట్టిమిట్టాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు..అక్కడ వచ్చిన భారీ వరదలు జనజీవనాన్ని స్తంభింప చేశాయి తాగడానికి నీళ్ళు లేవు..తినడానికి తిండి లేదు..ఇలాంటి దుర్భర పరిస్థితి ఎన్నడూ చూడలేదు కేరళా వాసులు..

Kerala NRIs Getting Problem About Returning To UAE-

Kerala NRIs Getting Problem About Returning To UAE

ఇదిలాఉంటే కేరళ కి చెందిన ప్రవాసులని మరొక భయం ఇప్పుడు వెంటాడుతోంది..ముఖ్యంగా యూఏఈ లో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రవాసులకి ఊహించి రీతిలో ఆపద ఎదురయ్యింది..ఇప్పుడు యూఏఈలో వేసవి కావడంతో కేరళలోని సొంత ప్రాంతాలకి ఎంతో మంది వచ్చి చేరుకున్నారు..ఐతే ఊహించని రీతిలో వర్షాలు పడటంతో అక్కడే చిక్కుకు పోయారు…ఒక వైపు తాము పనిచేసే కంపెనీలకి పెట్టుకున్న సెలవులు ముగియనున్నాయి దాంతో అక్కి నుంచీ వచ్చిన వారికి టెన్షన్ మొదలయ్యింది..

Kerala NRIs Getting Problem About Returning To UAE-

వారు పెట్టుకున్న గడువు ముగిసేలోగా ఎలా యూఏఈ చేరుకోవాలో తెలియక టెన్షన్ పడుతున్నారు..దాంతో ఉద్యోగాలు కోల్పోతామేమోననే భయం వారిని వెంటాడుతోంది…మరోపక్క యూఏఈ ఉన్న కేరళ వాసులు తమవారు ఎలా ఉన్నారో అంటూ హైరానా పడుతున్నారు…ఇప్పటికిప్పుడు వారు తమ స్వస్థలాలకి వెళ్ళే అవకాశం లేకపోవడంతో మరింత ఆందోళనలకి లోనవుతున్నారు..