రియల్ హీరోస్ : మా సాయానికి వెలకట్టొద్దు,ముఖ్యమంత్రి రివార్డుని సున్నితంగా తిరస్కరించిన మత్స్యకారులు     2018-08-22   10:55:13  IST  Rajakumari K

జలదిగ్బంధంలో చిక్కుకున్న ఏనుగుని రక్షించిన కొందరు…పడవలోకి ఎక్కడానికి కష్టపడుతున్న పండుముసలికి మెట్టుగా మారిన వ్యక్తి..వరదల్లో చిక్కుకున్న పసిగుడ్డును జాగ్రత్తగా రక్షించిన వ్యక్తి వీరంతా ఆర్మి,ఎన్డీఆర్ఎఫ్ కి చెందిన వారు కాదు..మామూలు మత్సకారులు… అయితేనేమి వారి ప్రాణాలకు సైతం తెగించి ఎంతోమందిని రక్షించారు..వీరికి ఇప్పుడు కేరళ ముఖ్యమంత్రి రివార్డు ప్రకటించారు..దానిపై వారు ఎలా స్పందించారో తెలుసా..

Kerala Governament Revarded But Fisherman Refuses In Floods-

Kerala Governament Revarded But Fisherman Refuses In Kerala Floods

నిన్న మొన్నటివరకు నీటిలో మునిగి ఉందా అన్నట్టు తలపిస్తున్న కేరళ ఇప్పుడిప్పుడే వరదల ప్రభావం నుండి కోలుకుంటుంది..వరదప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఆర్మి,ఎన్డీఆర్ఎఫ్ ఎంతగా కృషిచేశాయో..ప్రాణాలకు తెగించి ఎంతటి సాహాసాలు చేశాయో మనకు తెలిసిందే..కాని వారితో పాటుగా బాదితులను రక్షించడానికి మరికొందరు ముందుకొచ్చారు..వారే మత్స్యకారులు..ఆర్మితోపాటుగా బాదితులను రక్షించడానికి తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి సహాయచర్యల్లో పాల్గొన్నారు.అలా సాయం చేస్తున్న వారికి ఒక్కొక్కరికి రూ.3000 ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అయితే దానిని మత్స్యకారులు తిరస్కరించారు..

Kerala Governament Revarded But Fisherman Refuses In Floods-

ఫోర్ట్ కొచ్చికి చెందిన మత్స్యకారుల నాయకుడు ఖాయాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తమను ప్రశంసించడం ఆనందంగా ఉందని చెప్పారు. నేను, నా మిత్రులు ఎంతోమందినికాపాడాం…మమల్ని సహాయం అందించిన వారి పాలిట ఆర్మీలా పేర్కొనడం ఆనందంగా ఉందన్నారు. తమ సహాయానికి గాను ఒక్కొక్కరికి రూ.3వేలు ఇస్తామని చెప్పినట్లుగా విన్నామని, అది తమను బాధించిందని, ఎందుకంటే మేం డబ్బుల కోసం ఆ పని చేయలేదన్నారు. తోటి వారి ప్రాణాలు కాపాడినందుకు తమకు డబ్బులు అవసరం లేదని చెప్పారు. నష్టపోయిన తమ పడవలను ప్రభుత్వం బాగు చేయిస్తానని చెప్పిందని, అందుకు అందరం సంతోషంగా ఉన్నామని చెప్పారు. తాము మానవత్వంతో సాయం చేశామన్నారు. మా సాయానికి వెలకట్టద్దన్నారు.