కేసీఆర్ రాజకీయం ఇంతే.. వారికి అంత అన్యాయం జరిగిందా

ఇప్పుడు మేము రాజకీయాల్లో ఉన్నాం .ఆ తరువాత మా వారసులు రంగంలో ఉండాలి.

 Kcr Mark Politics On Trs Mla Candidates List-TeluguStop.com

తమకంటే గొప్ప నాయకులుగా ఎదగాలి.ఇదే ఆలోచనలో ప్రతి రాజకీయ నాయకుడు ఉంటాడు.

దేశంలో ఎక్కడ చూసినా వారసత్వ రాజకీయాలే కనిపిస్తున్నాయి.జనాలకు కూడా ఇది రొటీన్ అయిపొయింది.

కానీ తెలంగాణాలో మాత్రం అలాంటి ఆలోచన ఉన్న నాయకుల పప్పులు ఉడకకుండా చేసాడు కేసీఆర్.వయోభారం, అనారోగ్య సమస్యలు ఇలా అనేక కారణాలతో ఈసారి ఎన్నికల్లో తమ వారసులకు టికెట్ ఇప్పించుకుందామని ఆరాటపడిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులకు మొండిచేయి చూపాడు కేసీఆర్.

వారసులకు కాకుండా సీనియర్ లకే టికెట్స్ కేటాయించి వారసుల ఆశలపై నీళ్లు చల్లాడు.

తండ్రుల రాజకీయ వారసులుగా ఈ ఎన్నికల్లో అరంగేట్రం చేద్దామని ఊపు మీదున్న ఆ నాయకులకు ఊహించని షాక్ ఇచ్చారు.తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో సొంత పార్టీ నేతలే కాదు ప్రతిపక్ష నాయకులూ ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో పడిపోయారు.శుక్రవారం హుస్నాబాద్‌లో జరినే ప్రజా ఆశీర్వాద సభలో పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తారని ప్రచారం జరిగింది.

కానీ.అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గురువారమే ఏకంగా 105 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు.

టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల వారసులు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయా నియోజకవర్గాల్లో కలియతిరిగారు.తమకు టికెట్ ఖాయమని ప్రచారం చేసుకున్నారు.ఒకానొక దశలో పలువురు నాయకులు కూడా ఈసారి తమ వారసులకు టికెట్లు ఇవ్వాలనే కోరికను కూడా కేసీఆర్ వద్ద బయటపెట్టారు.ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పర్యాటక శాఖ మంత్రి చందూలాల్‌కు బదులు ఆయన కుమారుడు ప్రహ్లాద్ కి టికెట్ వస్తుందని అంతా భావించారు.

కానీ కేసీఆర్ మాత్రం చందూలాల్‌కే టికెట్ కేటాయించారు.అలాగే తెలంగాణా ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ కూడా ఈసారి తమతోపాటు తమ వారసురాలు సుష్మిత పటేల్‌ కూడా టికెట్ ఇప్పించుకోవాలని కొంతకాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.

అయితే సురేఖ టికెట్ పెండింగ్ లో పెట్టారు కేసీఆర్.

అలాగే.

ఉమ్మడి నిజామాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు కూడా టికెట్ కోసం గట్టి ప్రయత్నమే చేశారు.ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు కుమారుడు కూడా టికెట్ కోసం ప్రయత్నం చేసినట్లు ప్రచారం జరిగింది.

ఉమ్మడి వరంగల్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కుమారుడు రవిచంద్రకూడా ఈసారి తనకు టికెట్ ఇప్పించాలని డిమాండ్ గట్టిగా చేసాడట.అలాగే రెడ్యానాయక్ కూడా తన కుమార్తె కు మహబూబాబాద్ సీటు కోసం ప్రయత్నించి విఫలం అయ్యాడు.

ఇవేవి పట్టించుకోని కేసీఆర్ మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చాడు.ఎక్కడ వారసులకు టికెట్ ఇవ్వకుండా కేసీఆర్ చాలా పగడ్బందీగా టికెట్ల కేటాయింపు చేసాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube