కేసీఆర్ కి అసలు టెన్షన్ ఇప్పుడు మొదలయ్యింది   KCR Clarifies The Confussion On Party Tickets To Sitting     2018-09-05   10:14:28  IST  Sai M

ఎక్కడ లేని గాంభీర్యం .. కొండలను సైతం పిండి చేసేస్తా అనే స్థాయిలో తన వాక్చాతుర్యం .. ఎప్పుడూ విజయం మనదే అన్నట్టుగా కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఎప్పుడూ తెలంగాణ సీఎం కేసీఆర్ లో కనిపిస్తుంటాయి. అందుకే ఆయన అంత ధీమాగా
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్ వందకుపైగా సీట్లు గెలుచుకుంటుందని చెబుతూ వస్తున్నాడు. తనదైన వ్యూహంతో ప్రత్యర్థిని ముప్పు తిప్పలు పెట్టే కేసీఆర్ ఇప్పుడు భయపడుతున్నట్టు కనిపిస్తోంది. ఆ భయానికి కూడా సొంత పార్టీ నేతలే కారణమట.

తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాల్లో తాము గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోన్న వంద స్థానాల్లో సగానికి పైగా స్థానాల్లో పార్టీ నేతల మధ్య సమన్వయమే లేదట. గ్రూపు రాజకీయాలతో ఎవరికీ వారు నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ కొట్టుకుంటున్నారట. నేపథ్యంలో లోలోపల కేసీఆర్‌కు టెన్షన్ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. దీనిపై ఆ పార్టీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓవైపు ముందస్తు రాగం వినిపిస్తున్న కేసీఆర్ కు ఈ పరిణామం మింగుడుపడడం లేదు.

చాలా నియోజకవర్గాల్లో సీట్ల కోసం కాచుకుని కూర్చొన్న వారు ఈసారి ఆ సిట్టింగులకు టికెట్లు ఇస్తే తాము సహకరించేది లేదని తేల్చి చెబుతున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులపై గెలిచిన కాంగ్రెస్‌, టీడీపీ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఆయా పార్టీల నాయకుల్లో ఎక్కువగా ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో టికెట్ల కోసం వీరి మధ్య పోరు తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకరికి టికెట్ ఇస్తే ఇంకొకరికి కోపం ఆ కోపంతో పార్టీ ఓటమికి వారు ఎక్కడ ఒడిగడతారో అనే టెన్షన్ కేసీఆర్ లో కనిపిస్తోంది.

KCR Clarifies The Confussion On Party Tickets To Sitting-

ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు వ్యతిరేకంగా రాజారపు ప్రతాప్ పర్యటనలు చేస్తున్నారు. మానుకోట నియోజకవర్గంలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవిత ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ తూర్పులోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే కొండా సురేఖ కూడా పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావుతోపాటు మరో ఇద్దరు ముగ్గురి నుంచి పోటీని ఎదుర్కొంటున్నారు. స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ప్రాతినిధ్యం వహిస్తున్న భూపాలపల్లిలోనూ ఇదే పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి నియోజకవర్గంలోనూ ఇటువంటి పరిస్థితులే ఉండడంతో కేసీఆర్ ఏమి చెయ్యాలో తెలియక అయోమయంలో ఉన్నాడు.