తనీష్, గీత, సామ్రాట్, రోల్ రైడ లను ఓ కౌశల్ ఫ్యాన్ ఎలా తిడ్తున్నారో చూడండి! కౌశల్ ని బయటకి పంపించేయండి!   Kaushal Fan Targets Tanish Geetha And Samrat     2018-09-22   13:57:24  IST  Sainath G

బిగ్ బాస్ సీజన్ 2లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ కౌశల్ కి ప్రజల్లో ఎంతగా ఫాలోయింగ్ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కోసం సోషల్ మీడియాలో ఆర్మీ కూడా తయారైంది. ఇక కౌశల్ ని సపోర్ట్ చేస్తూ హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాల్లో ర్యాలీ కూడా నిర్వహించారు. హౌస్ లో కంటెస్టెంట్స్ ఒక్కరు కూడా కౌశల్ కి సపోర్ట్ ఇవ్వలేదు. కానీ ప్రేక్షకుల అభిమానులతో కౌశల్ బిగ్ బాస్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి.

వీలైనంతగా కౌశల్ కి మద్దతు తెలుపుతూ అతడిని విన్నర్ చేయాలని కౌశల్ ఆర్మీ ప్లాన్. అయితే కౌశల్ పై ఉన్న అభిమానం పీక్స్ కి చేరిందని, ఆయనలో బ్యాడ్ పార్ట్ బయట పడుతున్నా.. పిచ్చిగా అభిమానిస్తున్నారంటూ హేళన చేసేవారు కూడా లేకపోలేదు. అయినా.. కౌశల్ ఆర్మీ అటువంటి కామెంట్స్ పట్టించుకోకుండా.. ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు.

ఇది ఇలా ఉండగా…కౌశల్ ని సపోర్ట్ చేస్తూ బిగ్ బాస్ షో పై ఫైర్ అయ్యారు ఓ కౌశల్ ఫ్యాన్. టి.ఆర్.పి కోసం ఒక కంటెస్టెంట్ ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు అంటూ ఫైర్ అయ్యారు. ఆ వీడియో మీరే చూడండి. తనీష్, గీత లను ఎలా తిడుతున్నారో చూడండి.

Watch Video: