ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ పేరు మీద ఇలా చేయటం ఇదే ఫస్ట్ టైం అనుకుంట.! ఆర్మీ నే అనుకుంటే ఇప్పుడు.!   Kaushal Army Conduct 2k Run In Madhapur In Hyderabad     2018-09-09   08:57:05  IST  Sainath G

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 2 అతి త్వరలోనే పూర్తి కాబోతుంది. ఈ సారి ఆరంభం నుండి కూడా విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఆ విమర్శలను ఎదుర్కొంటూనే బిగ్‌బాస్‌ను ముందుకు తీసుకు వెళ్తున్నారు. సెలబ్రెటీల విషయంలో ఆరంభంలోనే పెదవి విరిచిన ప్రేక్షకులు ఆ తర్వాత ఒక్కొ ఇంటి సభ్యుడిపై ఒక్కో విధంగా స్పందస్తూ వస్తున్నారు. మొదట బిగ్‌బాస్‌కు గీతా మాధురి చాలా చాలా ప్లస్‌ అవుతుందని, ఆమె తప్పకుండా ఫైనల్‌ వరకు ఉంటుందని అంతా అనుకున్నారు. అంతా అనుకున్నట్లుగా ఫైనల్‌ వరకు ఆమె ఉండే అవకాశం కనిపిస్తుంది. కాని ఆమెపై ప్రేక్షకుల్లో విమర్శలు తారా స్థాయిలో వస్తున్నాయి. ఇక కౌశల్ ఆర్మీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంట.

సీజన్ 1కి రానంత క్రేజ్ 2కి వచ్చింది. దీనికి కారణం బిగ్‌బాస్ కంటెస్టెంట్ కౌశల్. ఇతని పేరు మీద ఆర్మీ క్రియేట్ అవడమే కాకుండా.. ఇది ‘బిగ్‌బాస్’ని శాసించే స్థితికి చేరుకుందని తెలుస్తోంది. తాజాగా బయటి పరిస్థితులు మరింత హీట్‌ని పుట్టిస్తాయి. ఈ షో చివరి దశకు వచ్చేసిన నేపథ్యంలో కౌశల్‌కి సపోర్ట్‌గా 2కె రన్ నిర్వహిస్తోంది కౌశల్ ఆర్మీ. ఒక కంటెస్టెంట్ పేరు మీద రన్ నిర్వహించడం తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే ప్రథమంగా కనిపిస్తోంది.

Kaushal Army Conduct 2k Run In Madhapur Hyderabad-

2కె రన్ విషయాన్ని ఓ వీడియో ద్వారా తెలిపిన కౌశల్ ఆర్మీ ఈ సందర్భంగా పోస్టర్‌ను, టీషర్ట్స్‌ను ఆవిష్కరించింది. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ ఎత్తున మద్దతు రావడం మరో విశేషం. ఈ 2కె రన్‌ను మాదాపూర్‌లో నిర్వహించనున్నట్టు కౌశల్ ఆర్మీ సభ్యులు తెలిపారు. దీనికి పోలీస్ పర్మిషన్ కూడా ఉందని వెల్లడించారు. మరి ఈ 2కె రన్‌కు ప్రేక్షకుల మద్దతు ఏమేరకు లభిస్తుందో రేపు చూడాలి.

Watch Video:

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.