వర్షంలో తడుస్తానని భయపడి...హీరోయిన్ కత్రినా కైఫ్ ఎయిర్ పోర్ట్ లో ఏం చేసారో తెలుసా?  

వర్షంలో తడవడమంటే కొందరికి ఇష్టం మరికొందరికి జ్వరం వస్తుందనే భయం. వర్షాకాలంలో మనం సాధారణంగా గొడుగు లేదా రెయిన్ కోర్ట్ దగ్గర పెట్టుకుంటాము . ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుందో మనకి తెలీదు. చిన్నపాటి వర్షాలకు పనులు ఆపుకోలేము కదా. కాకపోతే వర్షం మరీ పెద్దగా పడితే ఇంట్లోనే ఉండడానికి ట్రై చేస్తాము. అయితే ఇది మనలాంటి కామన్ మాన్ విషయంలో జరుగుతుంది. మరి సెలబ్రిటీస్ విషయంలో ఏమవుతుంది? అదేం ప్రశ్న…వాళ్ళకి సొంత కార్వాన్ ఉంటుంది, కారులోనే ప్రయాణం చేస్తారు, కాలు బయటపెట్టే సరికి గొడుగు పట్టుకొని అసిస్టెంట్ ఉంటాడు. ఇక వాళ్ళు వర్షంలో తడవడం సాధ్యం కాదు. కానీ ఓ హీరోయిన్ మాత్రం వర్షంలో తడుస్తానని భయపడి ఏం చేసిందో తెలుసా.?

Katrina Kaif Sitting Inside The Plane Due Heavy Rainfall In Ranchi Airport-

Katrina Kaif Sitting Inside The Plane Due Heavy Rainfall In Ranchi Airport

బాలీవుడ్ నటి కత్రీనాకైఫ్ ప్రత్యేక విమానంలో జార్ఖండ్‌లోని రాంచీ వచ్చారు. చిన్నపాటి వర్షం నడుమ ఆమె ప్రయాణించిన విమానం రాంచీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. అయితే బయట వర్షం పడుతుండటాన్ని గమనించిన కత్రీనా తడిసిపోతాననే భయంతో విమానంలోనే 10 నిముషాల పాటు కూర్చుండిపోయారు. తరువాత వర్షం కాస్త తగ్గడంతో ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ హ్యాండ్లింగ్‌స్టాఫ్ గొడుగు తీసుకువచ్చి, ఆమెను బయటకు తీసుకువచ్చారు.

టెర్మినల్ భవన్‌లోకి వచ్చిన ఆమె అభిమానులను కలుసుకున్నారు. కత్రీనా వస్తున్నదన్న వార్త తెలియగానే అక్కడకు యువకులు పెద్దఎత్తున చేరుకున్నారు. అమె అందరికీ అభివాదం తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు రాంచీ ఎయిర్‌పోర్టులో భారీబందోబస్తు ఏర్పాటు చేశారు.