కౌశల్ ఆర్మీని కెలికిన కత్తి మహేష్.. ఆ పేరులోనే హింస! ఇంకేమన్నాడో చూస్తే కౌశల్ ఫాన్స్ కి కోపమొస్తుంది!   Kathi Mahesh Targets Kaushal Army     2018-09-15   10:50:39  IST  Sainath G

బిగ్ బాస్ సీజన్2 మొదలైన దగ్గర నుండి సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. బిగ్ బాస్ కంటెస్టెంట్ కౌశల్ కోసం ఏకంగా కౌశల్ ఆర్మీ ఏర్పాటైంది. ఈ ఆర్మీ కౌశల్ ని ఎలిమినేషన్ నుండి కాపాడడం, అతడికి అత్యధిక ఓట్లు నమోదయ్యేలా చూడడం వంటివి చేస్తుంది.కౌశల్‌‌ను వ్యతిరేకించే సభ్యులను దుర్భషలాడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. కౌశల్ ఆర్మీపై ఎప్పుడూ వివాదాల్లో ఉండే కత్తి మహేష్ కామెంట్ చేశాడు.

ఓ ఆన్‌లైన్ మీడియా చానెల్‌తో ఆయన మాట్లాడుతూ.. ‘‘అభిమానం ఉండొచ్చు కానీ, దురాభిమానం ఉండకూడదు. బి‌గ్‌బాస్‌‌కు వచ్చిన తర్వాత ఇంట్లోవారిలా మెలిగాల్సి ఉంటుంది. హౌస్‌మేట్స్‌లో కొందరు నచ్చవచ్చు లేదా నచ్చకపోవచ్చు. అయితే, నచ్చనవారిపై విమర్శలు చేస్తూ ఉన్మాద స్థాయికి చేరుకోవడం మంచిది కాదు. కౌశల్ ఆర్మీ హేయమైన పదజాలంతో విమర్శించడం, బెదిరింపులు చేయడం మంచిది కాదు. కౌశల్‌కే కాకుండా, మిగతా వాళ్లకు కుటుంబాలు ఉంటాయి. అలాంటి ట్రోలింగ్‌లు వారిని బాధిస్తాయి’’ అని తెలిపారు.?

Kathi Mahesh Targets Kaushal Army-

‘‘కౌశల్ ఆర్మీ అనే పదంలోనే హింస కనిపిస్తోంది. వీరు ఎవరికి సైన్యం? ఎవరి కోసం సైన్యం? అనేది అర్థం కావడం లేదు. ఏవరీ కౌశల్. బహుశా ఆయన కొందరికి నచ్చి ఉండచ్చు. నాకు నచ్చలేదు. అలాగని ట్రోల్ చేస్తారా? ఇటీవల ఆయన పేరు మీద టూకే రన్ కూడా చేశారు. కేరళ వరదలు కోసం అలాంటివి చేసి ఉంటే సమాజానికి మంచి సంకేతాలు అందేవి’’ అని కత్తి మహేష్ అన్నారు. మీరు ట్రోల్ చేసే వ్యక్తులకు కూడా కుటుంబాలు ఉంటాయనేది గమనించాలి. ఇలా ట్రోల్ చేస్తే వారి కుటుంబ సభ్యులు బాధపడతారు అంటూ కత్తి మహేష్ కౌశల్ ఆర్మీపై మండిపడ్డాడు.