కౌశల్‌కు ఓట్లు వేసే వారు అంతా కూడా మూర్ఖులే..!   Kathi Mahesh Comments On Who Was Supports Kaushal Army     2018-09-24   15:35:18  IST  Ramesh P

తెలుగు బిగ్‌ బాస్‌ ఫైనల్‌కు చేరింది. ఈ వారంతో తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 విజేత ఎవరు అనే విషయంపై క్లారిటీ వచ్చేయనుంది. గత కొన్ని రోజులుగా కౌశల్‌కు అభిమానులు ఏ స్థాయిలో పెరిగి పోయారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లో కౌశల్‌ ఆర్మీ నిర్వహించిన 2కే రన్‌ సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. దాంతో ఖచ్చితంగా కౌశల్‌ విజేతగా నిలుస్తాడు అంటూ అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కత్తి మహేష్‌ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఆమద్య పవన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన కత్తి మహేష్‌ తాజాగా కౌశల్‌పై తనదైన శైలిలో విరుచుకు పడ్డాడు. బిగ్‌ బాస్‌ సీజన్‌లో అతి నస క్యాండెట్‌ కౌశల్‌ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కౌశల్‌ బిగ్‌బాస్‌లో అస్సు పనికి రాడు అంటూ కత్తి మహేష్‌ అన్నాడు. గత కొన్ని రోజులుగా కౌశల్‌ను టార్గెట్‌ చేస్తూ కత్తి మహేష్‌ చేస్తున్న విమర్శలు పీక్స్‌కు చేరాయి. అసలు కత్తి మహేష్‌ పై సోషల్‌ మీడియాలో కౌశల్‌ ఆర్మీ చిన్నపాటి యుద్దం మొదలు పెట్టింది.

Kathi Mahesh Comments On Who Was Supports Kaushal Army-

కత్తి మహేష్‌ తాజాగా కౌశల్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. కౌశల్‌పై కు ఓట్లు వేసే ప్రతి ఒక్కరు మూర్ఖులే అన్నాడు. దాంతో పాటు కత్తి మహేష్‌ బిగ్‌ బాస్‌ విన్నర్‌ అయితే మనమంతా కూడా మూర్ఖులం అంటూ సంచలన కామెంట్స్‌ చేశాడు. ఈ సమయంలోనే కత్తి మహేష్‌ తాను దీప్తి నలమోతుకు మద్దతు పలుకుతున్నట్లుగా ప్రకటించాడు. తాను దీప్తి తరపున క్యాంపెయిన్‌ చేస్తున్నట్లుగా కూడా పేర్కొన్నాడు. కత్తి మహేష్‌ పాపులారిటీ వచ్చిన వారిపై విమర్శలు చేసి తాను పాపులారిటీ దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.