కరుణానిధి చనిపోయినట్లు ఆయన రెండో భార్యకు తెలియదు అంట! ఎందుకో తెలుసా .?     2018-08-11   10:05:42  IST  Sai Mallula

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. మెరీనా బీచ్‌లోని అన్నా స్క్వేర్‌ ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో కరుణ అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యులు, లక్షలాది మంది అభిమానులు ఆశ్రునయనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు. సాయంత్రం 6.15 గంటలకు మెరీనా బీచ్‌కు చేరుకున్న ఆయన భౌతికకాయానికి తొలుత పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆ తర్వాత త్రివిధ దళాలు ఆయన భౌతికకాయానికి గౌరవ వందనం సమర్పించాయి. కరుణానిధి పార్థీవదేహంపై కప్పి ఉంచిన జెండాను స్టాలిన్‌కు అందజేశారు. అనంతరం డీఎంకే జెండాను కప్పారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు కడసారి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు. ఆ తర్వాత త్రివిధ దళాలు కరుణ పార్థీవదేహాన్ని ప్రత్యేకంగా తయారు చేసిన పేటికలో ఉంచి ఖననం చేశారు. ఆ సమయంలో భద్రత బలగాలు గౌరవసూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు.

Karunanidhi Second Wife Dont Know About Karunanidhi-

Karunanidhi Second Wife Dont Know About Karunanidhi

అయితే ఇది ఇలా ఉండగా…ఒక ఆసక్తికర విషయం బయటకి వచ్చింది. కరుణానిధి చనిపోయినట్లు రెండో భార్యకు తెలియదు అంట. కళ్లముందే భర్త ఆఖరి మజిలీ మొదలవుతున్నా.. ఏమాత్రం గుర్తించలేని స్థితి ఆమెది. డీఎంకే అధినేత కరుణానిధి కన్నుమూత, తీవ్ర అస్వస్థతతో ఉన్న ఆయన రెండవ భార్య దయాళు అమ్మాళ్‌కు తెలియదు. 2016 నుంచే ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. కళ్ల ముందు ఏం జరుగుతుందో గ్రహించలేని స్థితిలో ఉన్న ఆమెకు, జ్ఞాపకశక్తి కూడా దెబ్బతిన్నట్లు సమాచారం.

కరుణ ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో.. మూడు రోజుల క్రితం పెద్ద కుమారుడు అళగిరి ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చి కరుణ వద్ద కొంతసేపు వుంచి ఇంటికి తీసుకెళ్లారు. మంగళవారం సాయంత్రం గోపాలపురంలోని ఇంటికి కరుణ పార్థివదేహాన్ని తీసుకొచ్చినప్పుడు ఆమె ఇంట్లోనే ఉన్నప్పటికీ.. ఏం జరిగిందో గ్రహించే స్థితిలో లేరు. అందుకే.. మెరీనాబీచ్‌లో జరిగిన కరుణ అంత్యక్రియలకు దయాళు అమ్మాళ్‌ను తీసుకురాలేదు.