ఆ అమ్మాయిని వదలదేదు అని సూసైడ్ నోట్ రాసిన ఓ లవ్ ఫెయిల్యూర్.! అసలేమైందో తెలుస్తే కన్నీళ్లే.!   Karimnagar Young Men Suicide Letter Goes Viral     2018-09-09   10:26:56  IST  Sainath G

తనను ప్రేమించిన యువతి మోసం చేసిందని సూసైడ్ నోట్ రాసి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన రామగిరి రోహిత్(21)అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల లోకి వెళ్తే..

గాంధీనగర్‌కు చెందిన రామగిరి చంద్రశేఖర్-లక్ష్మి దంపతులకు ముగ్గురు కొడుకులు సాయిశివ, రోహిత్, వినీత్. రెండో కొడుకైన రోహిత్, పట్టణంలో నివాసముంటున్న ఓ యువతి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇద్దరి మధ్యల మనస్పర్థలు వచ్చి తనను దూరంగా ఉంచుతుందని సూసైడ్‌నోట్ రాసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు రోహిత్ సోదరుడు సాయిశివ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు నెలల క్రితం రోహిత్ తండ్రి చంద్రశేఖర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఇతను కాంట్రాక్ట్ పద్ధతిన చెల్పూర్ పీహెచ్‌సీలో హెల్త్‌అసిస్టెంట్‌గా పని చేసేవాడు.

ప్రేమించిన అమ్మాయిది కూడా హుజూరాబాద్ పట్టణమే అని స్థానికులు చెప్పారు. ఇద్దరూ కొన్నాళ్లుగా ప్రేమించుకుని సన్నిహితంగా మెలిగారని తెలిసినవాళ్లు చెబుతున్నారు. అబ్బాయి ఇంటర్ పూర్తిచేశాడు. అమ్మాయి హైదరాబాద్ లో బీటెక్ చదువుతోంది. ఇద్దరివి వేర్వేరు కులాలు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని అమ్మాయి చెప్పడంతో కొద్దిరోజులుగా రోహిత్ మనోవేదనలో ఉన్నాడు. యువతి ఇంట్లో వాళ్లతో మాట్లాడినా అంగీకరించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.

అమ్మను మంచిగా చూసుకోండి అమ్మను మంచిగా చూసుకోవాలని సోదరులను కోరుతూ సూసైడ్‌నోట్‌లో పేర్కొనాడు. అమ్మకు ఆరోగ్యం బాగుండదు… సమయానికి మాత్రలు అందించాలి. నేను దూరంగా వెళ్లి పోతున్నా. ఇక నుంచి మీకు కనబడను. అమ్మాయిలతో ప్రేమలో పడితే మోసం చేస్తారు. అంటూ లేఖలో పేర్కొన్నాడు.