కళ్యాణ్‌ రామ్‌ కోరిక తీర్చకుండానే వెళ్లి పోయిన హరికృష్ణ.. ఏంటో తెలుసా!     2018-08-30   08:24:30  IST  Ramesh Palla

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన హరికృష్ణ నందమూరి కుటుంబంను శోఖ సంద్రంలో ముంచేశారు. ఎన్నో ఆశలు ఆయనపై కుటుంబ సభ్యులు పెట్టుకుని జీవిస్తున్న సమయంలో ఆయన అవన్ని వదిలేసి వెళ్లి పోవడంతో కుటుంబ సభ్యులు దుఖంలో మునిగి పోయారు. అభిమాని ఇంట జరుగుతున్న ఒక పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు వెళ్తున్న హరికృష్ణ ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆయన కుటుంబ సభ్యులు అబిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి వ్యక్తం చేస్తున్నారు. ఇక కళ్యాణ్‌ రామ్‌ చాలా రోజులుగా ఒక కల కంటున్నారు.

కళ్యాణ్‌ రామ్‌ గత కొంత కాలంగా తమ్ముడు ఎన్టీఆర్‌, నాన్న హరికృష్ణతో ఒక చిత్రాన్ని చేయాలని కోరుకుంటున్నాడు. ఆ చిత్రంలో తాను కూడా నటించాలని కోరుకున్నాడు. నాన్నతో కలిసి నటించాలనే కోరిక కళ్యాణ్‌ రామ్‌కు చాలా కాలంగా ఉంది. అది త్వరలోనే నెరవేరుతుందని నందమూరి ఫ్యాన్స్‌ కూడా భావించారు. కాని అనూహ్యంగా కళ్యాణ్‌ రామ్‌ కోరిక తీరకుండానే హరికృష్ణ మృతి చెందడంతో తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Kalyan Ram Want To Act With Hari Krishna-

Kalyan Ram Want To Act With Hari Krishna

ఎన్టీఆర్‌ మరియు కళ్యాణ్‌ రామ్‌లకు హరికృష్ణ అంటే చాలా అభిమానం. ఆ అభిమానం పలు సందర్బాల్లో చూపించారు కూడా. ఇక వీరు కలిసి నటిస్తే చూడాలని ఉందని అభిమానులు అనుకున్నారు. ఆమద్య పలు సినిమా వేడుకల్లో ఈ ముగ్గురు ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ఈ ముగ్గురి కలయిక ఫొటోలను చూసిన సమయంలో సినిమాల్లో ఈ ముగ్గురు నటిస్తే బాగుండు అని సినీ వర్గాల వారు కూడా అనుకున్నారు.

కళ్యాణ్‌ రామ్‌ కోరికను తీర్చకుండా వెళ్లిన హరికృష్ణ ప్రేక్షకులను కూడా నిరాశ పర్చాడు. హరికృష్ణతో సాధ్యం కానిది కనీసం ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌లు అయినా సుసాధ్యం చేస్తారేమో చూడాలి. ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌ల కలయికలో సినిమా రావాలని నందమూరి ఫ్యాన్స్‌ ఆశపడుతున్నారు.