అంత పెద్ద భూతుని సెన్సార్ కట్ చేయడం మరిచిపోయిందా సెన్సార్ టీం? అర్జున్ రెడ్డి టైం లో ఏమో .!  

ఈ సెన్సార్ వాళ్ళు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అస్సలు అర్ధం కాదు అండి. ఓ సారి దుష్పదజాలం లేకున్నా బీప్ చేస్తుంటారు. ఒకోసారి పెద్ద బూతులు ఉన్నా వదిలేస్తారు. అర్జున్ రెడ్డి సినిమా సమయంలో “ఏం మాట్లాడుతున్నావ్ రా” అన్న డైలాగ్ కు ఎన్ని గొడవలు అయ్యాయో అందరికి తెలిసిందే. చివరికి సెన్సార్ కట్ లతో రిలీజ్ చేసారు. ఇక మా టీవీ లో చూసేటప్పుడు అయితే అర్జున్ రెడ్డి అడల్ట్ మూవీ లాగా కాకుండా ఫామిలీ మూవీ లాగ కనిపించింది. అలాగే ఇప్పుడు సూర్య భార్య జ్యోతిక నటించిన ఓ సినిమాలోని అసభ్య పదాలతో కూడిన ఓ డైలాగ్ వివాదానికి గురయ్యింది. కాకపోతే ఈ సారి సెన్సార్ కట్ చేయలేదని వివాదం.

Jyothika Speak Bad Word Dialogue In Nachiyar..jhansi Movie Teaser-

Jyothika Speak Bad Word Dialogue In Nachiyar..jhansi Movie Teaser

తమిళంలో విడుదలై భారీ విజయం సాధించిన నాచియార్ చిత్రం తెలుగులో ‘ఝాన్సీ’ పేరుతో విడుదలకు సిద్ధంగా ఉంది. . జ్యోతిక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్‌‌లో ప్రేక్షకుల్ని థ్రిల్ చేసింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో ఝాన్సీ పేరుతో ఆగష్టు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. జివి ప్రకాష్ కీలకపాత్రలో నటించగా.. ఇళయరాజా సంగీతాన్ని అందించారు.

ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదల అయ్యింది. టీవీలో అది టెలికాస్ట్ అవ్వడం చూసి షాక్ అయ్యా. ఎందుకంటే అందులో ఓ బూతు ఉన్నా కూడా సెన్సార్ కట్ చేయకుండా టీవీలో టెలికాస్ట్ చేసారు. కనీసం ఫైనల్ గా థియేటర్ లో ప్రేక్షకుల ముందు తెరకెక్కించేటప్పుడైనా సెన్సార్ కట్ చేస్తారో లేదో చూడాలి! కామెంట్స్ లో ఎక్కడ తిడతారో అనుకోని చివరికి ఈ వీడియోకి కామెంట్స్ పెట్టె అవకాశం కూడా లేకుండా చేసారు.