ఈ విషయం తెలిశాక ఎన్టీఆర్‌ గ్రేట్‌ అనకుండా ఉండలేరు..     2018-09-01   10:03:13  IST  Ramesh Palla

నందమూరి హరికృష్ణ మరణం అందరికంటే ఎక్కువగా ఆయన కొడుకులు అయిన కళ్యాణ్‌ రామ్‌, ఎన్టీఆర్‌లకు పెద్ద లోటు. తండ్రి అంటే పంచ ప్రాణాలు పెట్టే ఎన్టీఆర్‌ ఎంతగా విలపించాడో మీడియాలో చూడటం జరిగింది. నాన్నకు ప్రేమతో చిత్రం సమయంలో తన తండ్రికి ఏమైనా అవుతుందా అనే ఆలోచన కూడా నేను భరించలేను అంటూ ఆయన చెప్పిన మాటలు అందరు గుర్తు చేసుకుని ఎన్టీఆర్‌ పట్ల సానుభూతిని వ్యక్తం చేశారు. తండ్రి చనిపోయిన బాధలో ఉన్న ఎన్టీఆర్‌ కనీసం వారం నుండి పది రోజులు అయినా ఇంట్లోనే ఉండిపోతాడని, చిత్రీకరణలో పాల్గొనక పోవచ్చు అనుకున్నారు.

Jr NTR Proves His Greatness About Mankind-

Jr NTR Proves His Greatness About His Mankind

ఎన్టీఆర్‌ నటిస్తున్న ‘అరవింద సమేత’ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఇప్పటికే చిత్రీకరణ ఆలస్యం అవ్వడంతో ఖచ్చితంగా దసరాకు తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో విదేశాల్లో చేయానుకున్న పాటల చిత్రీకరణ ఇక్కడే చేస్తున్నారు. ఈ సమయంలో వారం పది రోజులు షూటింగ్‌కు బ్రేక్‌ ఇస్తే నిర్మాత చాలా ఇబ్బందులను ఎదుర్కొంటాడు అనే విషయం ఎన్టీఆర్‌కు తెలుసు. అందుకే అరవింద సమేత చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసే బాధ్యతను నెత్తిన వేసుకుని నేటి నుండే షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు.

తండ్రి చనిపోయిన బాధను దిగమింగుకుని ఎన్టీఆర్‌ తన వర్క్‌లో మునిగి పోబోతున్నాడు. ఇతర వర్క్‌ అంటే ఏమో కాని నటన అనేది ఇలాంటి సమయంలో చాలా కష్టం. మొహంపై తండ్రి మరణంకు సంబంధించిన దిగులు, ఏడుపు, మనోవేదన కనిపించకుండా మెయింటేన్‌ చేస్తూ చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇలాంటి ఒక సందర్బం వస్తుందని ఎప్పుడు కూడా ఏ ఒక్కరు అనుకోరు. కాని ఎన్టీఆర్‌ ఈ పరిస్థితిని ఎదుర్కోవడం ఆయన అభిమానులను తీవ్రంగా కలచి వేస్తోంది.

Jr NTR Proves His Greatness About Mankind-

ఎన్టీఆర్‌తో పాటు తండ్రికి తలకొరివి పెట్టిన కళ్యాణ్‌ రామ్‌ కూడా నేటి నుండే చిత్రీకరణలో పాల్గొనబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం కళ్యాణ్‌ రామ్‌ నటిస్తున్న సినిమాకు గుహన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ సినిమా చిత్రీకరణ ముగించాల్సి ఉండగా కళ్యాణ్‌ రామ్‌ నేటి నుండే చిత్రీకరణలో పాల్గొంటాను అంటూ యూనిట్‌ సభ్యులకు తెలియజేయడం జరిగింది. ఇలా తండ్రి చనిపోయి నాల్గు రోజులు కూడా కాకుండానే ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌లు షూటింగ్‌లకు పాల్గొనడంతో అభిమానులతో పాటు ఇతరులు కూడా అభినందించకుండా ఉండలేక పోతున్నారు.