బిగ్ బాస్ 2 ఫైనల్స్ ని గ్రాండ్ గా చేయడానికి పెద్ద ప్లాన్..! గెస్ట్ గా వచ్చేది ఆ ఇద్దరు హీరోలేనా.?   Jr NTR And Nagarjuna To Be Guest For Bigg Boss 2 Telugu Grand Finale     2018-09-22   09:53:19  IST  Sainath G

ఇంకొంచెం మసాలా అంటూ నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 2 మరో వారం రోజుల్లో ముగియనుంది. 17 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షోలో ప్రస్తుతం ఆరుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు.ఈ వారంలో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. హౌస్ నుండి ఎవరు వెళ్లిపోతారనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగిపోతోంది. ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న ఈ షో ఫైనల్స్ ని గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది యూనిట్.

కాకపోతే కౌశల్ ని టార్గెట్ చేసి తప్పుగా చూపెట్టే ప్రయత్నం చేస్తుంది అని మా పై ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు. కౌశల్ ని బయటకి పంపించేయండి. 50 లక్షలు మేము ఇచ్చి విన్నర్ ని చేస్తాము…మానసికంగా ఇబ్బంది పెట్టకండి అంటూ ఫైర్ అవుతున్నారు. అంత నెగటివిటి నుండి బయటకి రావాలని బిగ్ బాస్ బృందం ఫైనల్స్ ని గ్రాండ్ గా చేయడానికి పెద్ద ప్లాన్ నే వేస్తుంది.

Jr NTR And Nagarjuna To Be Guest For Bigg Boss 2 Telugu Grand Finale-

అతిథులుగా ఇద్దరు స్టార్ హీరోలు ఫైనల్స్ స్టేజ్ మీద కనిపించబోతున్నారని ఓ వార్త సినిమా ఫీల్డ్ లో వైరల్ అవుతుంది. ఆ ఇద్దరిలో ఒకరు నాగార్జున అనేది బలంగా వినిపిస్తుంది. తాజాగా బిగ్ బాస్ నిర్వాహకులు ఎన్టీఆర్ ని కూడా కలిసినట్లు తెలుస్తోంది. సీజన్ 1 కి హోస్ట్ గా వ్యవహరించిన ఎన్టీఆర్ ని ఫైనల్స్ కి అతిథిగా ఆహ్వానించారట బిగ్ బాస్ నిర్వాహకులు. ఎన్టీఆర్ కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఇక నాగార్జున అంటే స్టార్ మా లో పార్టనర్ కాబట్టి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ ఇది నిజమైతే…ఒకే తెరపై నాని,ఎన్టీఆర్, నాగార్జున ముగ్గురు ఎలా సందడి చేస్తారో చూడాలి.!